పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/623

ఈ పుట ఆమోదించబడ్డది
బాలవంతి:__

ఓ రాజా... నేనోమాట చెబుతాను చెవున బెట్టవలసింది
మన పేరూ మన వూరు పేరు చెబుతాను
మనకీ రాజరికం వుండి లాభమేమి
మనకీ ధనద్రవ్యాలు కూడా వుండి ఏమి లాభం లేదు.
వేములవాడ దేవుడుండీ కూడ లాభం లేకుండా వున్నది
వినవయ్యా ఓ రాజా.... నేనో మాట చెబుతాను
ఇటు చెవి బెట్టివిను.

అవర్సింగ్:__

ఓ నారీ? అదేమి సంగతో చెప్పు వింటాను.

బాలవంతి:__

మనకు కొడుకులూ కూతుళ్ళూ లేరు
నిన్ను నాన్నా అని పిలిచే కొడుకులు లేరు
నన్ను అమ్మా అని పిలిచే కూతుర్లు లేరు
తండ్రి చెప్పులు తొడిగే కుమారుడు లేడు
తల్లి రవికెలు తొడిగే కూతురు లేదు
ఓ రాజా నీవిప్పుడు ఢౌలగిరి (ధవళగిరి)కి వెళ్ళాలి
నీవు కొడుకూ కూతుర్ల దానం పొందాలి.

అవర్ సింగ్:__

ఓ నా రాణీ... నేను కూడ ఓ మాట చెబుతాను
ఓ నారీ దేవుడివ్వందే కూతుర్లెట్టా కలుగుతారు
ఓ నారీ దేవుడివ్వందే కొడుకులెట్టా కలుగుతారు
సంతానం కోసం నేనెక్కడికీ వెళ్ళను
నాతో నీవున్నూ ఇట్లా చావవలసిందే తప్ప
నేను సంతానం కోసం ఎటూ వెళ్ళను సుమా.

బాలవంతి:__

వినవయ్య ఓ రాజా.. నేనో మాట చెబుతాను
కొడుకు కూతుర్ల వరం పొందడం కోసం నీవు తప్పక వెళ్ళాలి