దశకు చేరుకుంది. ఇటీవల ఔత్సాహికులైన గొంధళే కళాకారులు ఈ కళను కాపాడుకోవడం కోసం మహాలింగంపల్లి కేంద్రంగా గొంధళే నాటక మండలిని స్థాపించుకున్నారు.
- బాలవంతి కథా ప్రదర్శనం:
వారు ప్రదర్శించే ప్రదర్శనాలలో బాలవంతి కథ ఒకటి బాలవంతి కథలో రాజుకు సంతానం కలగదు. సంతాన ప్రాప్తికోసం తపస్సు చేసి
ఈశ్వరునివల్ల వరం పొంది రావలసిందిగా రాణి రాజును ప్రోత్స హిస్తుంది. మొదట రాజు అంగీకరించడు. ఐనా రాణి బలవంతం చేస్తుంది. రాజు తన రాజ్య భారాన్ని లింబోజీ ప్రధానికి అప్పగించి తపస్సు కోసం అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధపడాతాడు. ఆ సందర్బంలో వారిరువురి మధ్యా ఇలా సంవాదం జరుగుతుంది.
బాలవంతి: __ వారి ఆరె భాషలో ఇలా వుంటుంది.
ఐకుమి రాజా మీతోటి సంగిత కానిదారు ఐకుమి రాజా
అంచనామయూ అంచనామగాదు సంగిత మీ అంచనామయూ
వరదనుదదాలా తేరపరచదనుదదాల బోలుధడావో వరదనుదదాలా
వింబోజిదదాలా అతేవింబోజిదదాల బోలుధడావే వింబోజిదదాలా
ఈ విధంగా సాగే వారి సంవాదం తెలుగులో ఇలా వుంటుంది.