పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/621

ఈ పుట ఆమోదించబడ్డది
గోంధళీ బుర్ర కథలు:

ఇంతకు పూర్వం తెలంగాణాలో గొంధళీలు ఒక ప్రత్యేక మైన పద్దతిలో వీరరసాత్మకాలైన కథలనూ, కరుణారసభరితాలైన కథలనూ బుర్ర కథలుగా చెప్పేవారట. ఈ కథలు చెప్పే బృందాల్లో కథకుడు పొడుగాటి బొందెల జుబ్బాను ధరించి, ధోవతి కట్టి, నెత్తికి రంగుతో కూడిన రుమాలు చుట్టి, గవ్వల హారాన్ని జెందెం మాదిరిగా ధరించే వాడట. ఒకడు మద్దెల వాయిస్తూ వుండగా, మరొకడు కిన్నెర వాయించేవాడట. ఇంకొకడు తాళం వేస్తూ వుండగా కథకుడు ఆరె భాషలో కథ చెపుతూ వుండేవాడట, అయితే ఆ విధంగా కథలు చెప్పే వారు ఈనాడు లేరట.

వీథి భాగోతాలు:

అయితే ఈ గొంధళీలు, మధ్య తెలంగాణా ప్రాంతంలో ఆరె వారు ఎక్కువగా వుండే గ్రామలకు వెళ్ళీ, ఈనాటికీ వీధి భాగోతాలు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనాలు చాల వరకు మన వీధి నాటకాల పోలికలోనే వుంటాయట. వీరి భాగోతాలకు హంగుదార్లుగా హార్మోనియాన్ని, మద్దెలనూ ప్రక్క వాయిద్యాలుగా ఉపయోగిస్తారట. వీరు ప్రదర్శించే కథా ఇతి వృతాలు, భారత గాథలకూ, జానపద గాథలకూ సంబంధించి వుంటాయి. మన వీథి నాటకాలలో మాదిరి విదూషకుడులా వీరి భాగోతాలలో హాస్య పాత్ర ప్రవేశించి ప్రేక్షకుల్ని హాస్యం ద్వారా కడుపుబ్బ నివ్విస్తుంది. అంతే గాదు మధ్య మధ్యలో ఆరె భాషను తెలుగులోకి అనువదిస్తూ వుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరి హాస్య పాత్ర సంస్కృత నాటకాల్లోని విదూషకుని పాత్రను పోలి వుంటుంది. రాజు పాత్రలకు అతి సన్నిహితంగా వుంటాడు. వీరి భాగోతాల్లో స్త్రీ పాత్రల్ని పురుషులే ధరిస్తారు. ఇక కథలో వచ్చే పాత్రల పేర్లన్నీ మహారాష్ట్ర సంస్కృతికి సంబంధించినవే వుంటాయి. అయితే మరికొన్ని పాత్రల పేర్లు తెలుగు పేర్లుగానే వుంటాయి. ప్రదర్శించే రంగ స్థలంలో ఒక పొడుగాటి గవ్వల హారాన్ని వ్రేలాడ దీస్తారు. ఈ దండను వారు అంబా భవానికి చిహ్నంగా ఆరాధిస్తారు. గొంధళీ కళాకారులు అరె వారి పారితోషికాలతోనే జీవిస్తున్నారు. తెలుగు ప్రజలు కూడ వారిని ఆదుకుంటున్నారు.

అయితే గొంధళీల భాగోత ప్రదర్శనలకిప్పుడు ప్రజాదరణ తగ్గిపోతూవుంది. అందువల్ల గొంధళీలలో చాల మంది వ్వవసాయాన్ని వృత్తిగా స్వీకరిస్తున్నారు. మరి కొంతమంది, వేరే వృత్తిలో జీవిస్తున్నారు. క్రమ క్రమంగా ఈ కళ క్షీణించిపోయే