అప్పలనాయుడు, మీసాల ఎరుకు నాయుడు .....సుక్క పోలి నాయుడు. గొర్లి పేట రాముడు .... వైష్ణవ అప్పల స్వామి దొమ్మి, అప్పల స్వామి .... రంగు ముద్ర అప్పల స్వామి, ముసిది అవతారం .... బురడ గవరయ్య .... ధర్మవరపు గురువులు .... వరదా లక్ష్మణ రావు, పిన్నింటి రామునాయుడు, ఆర్ సింహాచల శర్మ, గిరిజాల సత్య నారాయణ, కల్లూరి సూర్య నారాయణ, శంబన సత్యనారాయణ, గురువిల్లి స్వామి నాయుడు, ఎం. సిమ్మప్పడు, పులఖండం నారాయణ మూర్తి శర్మ, కుందుం సాంబమూర్తి, పేరూరు వరహాలు మొదలైన ఎందరో సుప్రసిద్ధ కళాకారులు ఈ నాటికీ, ఈ తూర్పు భాగవత కళను ఆరాధిస్తున్నారు. గమనించ వలసిన విషయ మేమంటే, ఈ కళాకారులందరూ అరవై సంవత్సరాలకు పైబడిన వారే, అంటే ఈ తరం అంతరిస్తే తరువాత తరం వారు ఈ కళను ఆరాధించగలరా? అన్నది సందేహం.
- ఈ నాటికీ అరవై మేళాలు:
ఈనాటికీ ఆ ప్రాంతంలో అరవై భాగవత మేళాల వరకూ వున్నాయి. ప్రతి మేళానికి పదిమంది సభ్యులకు తక్కువ వుండరు. ఆ విధంగా ఆరు వందలకు పైగా సంగీత నృత్య కళాకారులు, సుమారు నూరు మంది, మృదంగ వాద్యకులూ వున్నారు. ఒక బాణీకి చెందిన ఇన్ని మేళాలు, ఇంత మంది కళాకారులు భారతదేశంలో ఏ ఒక్క కళారూపంలోనూ లేదంటారు సంపత్ కుమార్ గారు.