పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/610

ఈ పుట ఆమోదించబడ్డది

భారం పంపించి__మళ్ళీ తన ఇంటికి రప్పించుకున్న సంఘటనే ఈ కథా వృత్తంతం. కథ చిన్నదే అయినా ఇందులో అష్టవిధ నాయికల వర్ణనలూ, అవస్థలూ విప్రలంభ శృంగారంతో నిండి ఇది ఒక పెద్ద ప్రబంధమై పోయి, వరుసగా ఈ భాగవతాన్ని తొమ్మిది రోజులు ప్రదర్శించేవారట. ప్రారంభంలో, అటు వంటిది, కాలానుగుణ్యంగా మూడు రాత్రులకు కుదించారు. అయితే ఈనాడు ఈ కథను ఒక్క రాత్రే పూర్తి చేస్తున్నారు. శాస్త్ర యుక్తంగా ప్రదర్శించే భామా కలాపం తరువాత, గొల్లకలాప ప్రదర్శనాన్ని కూడ జన రంజకంగా ప్రదర్శించేవారు. అయితే ఈ గొల్ల కలాపం, దేశీ సాంప్రదాయానికి సంబంధించిన కళా రూపంగా ప్రదర్శించేవారు.

తూర్పు బాణీ ప్రత్యేకత:

ఈ భాగవత ప్రదర్శనంలో దరువులూ, ద్విపదలూ, కంద పద్యాలూ, వృతాలూ, అర్థ చంద్రికలూ, ఏల పదాలూ, చూర్ణికలూ మొదలైన దేశి సంగీత రచనలు వాటుతూ వుంటారు. ముఖ్యంగా ఈ దరువులు ఈ ఆటల్లో ప్రాముఖ్యం వహిస్తూ వుంటాయి.

భరతుడు నాట్య శాస్త్రంలో ఉదహరించిన ప్రాచీన ధృవాగానం ఈ నాటికీ తూర్పు వీధి భాగవతులు ప్రదర్శిస్తున్నారు.