- శైవం, వైష్ణవం చేరదీసిన నాట్యం:
శైవం, వీరశైవం, వైష్ణవం విజృంభించిన కాలంలో, దేశంలో అనేకమైన శైవ, వైష్ణవ దేవాలయాలు ఏర్పడ్డాయి. ఈ ఆలయాలన్నీ సంగీత నాట్యాలను ఎక్కువగా ఆదరించాయి. ప్రతి ఆలయంలో దేవ పూజా సమయంలో నాట్యం జరిగేది. ఉత్సవ సమయాల్లో ప్రత్యేకమైన ప్రదర్శనాలు జరిగేవి. ప్రతి దేవాలయంలోను నాట్య మండపాలుండేవి. అనేక మంది గాయకులు, వాద్యకులూ, నర్తకీ, నర్తకులూ దేవాలయ సిబ్బందిలో ఒక భాగంగా వుండేవారు. అనేక మంది శిల్పులు దేవాలయలమీద, స్థంభాల మీదా, గోడల మీదా, ద్వార బంధాల మీడా అనేకమైన భరత నాట్య కళారీతుల్ని చెక్కి నాట్యకళా సేవ చేసారు.
- అంతమైన అన్నదమ్ముల కలహం:
పల్నాటి యుద్ధంవల్ల అపార జననష్టం కలిగింది. ఇరుపక్షాలకూ తోడ్పడిన అనేక మంది చిన్న చిన్న సామంత రాజు లందరూ ఈ యుద్ధంలో నాశన మయ్యారు. ప్రజలు అనేక కష్టనష్టాలకు గురైనారు. సుస్థిర మైన ప్రభుత్యం కోసం ఎదురు చూడసాగారు. ఈ పరిస్థితిని గమనించిన కాకతీయులు దిగ్విజయ యాత్రలు ప్రారంబించి, సామంత రాజులందరినీ ఓడించి ఆంధ్ర దేశాన్నంతా తమ ఏలుబడి క్రింద ఐక్యం చేసి సుమారు 200 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు.
పల్నాటియుద్ధం నాటికే ఆంధ్రప్రదేశమంతటా బహుళవ్యాప్తి పొందిన వీరశైవమతం కాకతీయులకాలంలో 1200-1300 సంవత్సరాల మధ్య ఎంత వుధృతంగా వ్యాపించిందో ముందు చూడగలం
- దేవాలయాలకు దిగివచ్చిన నాట్యకళ:
ఏ రాజులు ఏ కళాసాంప్రదాయాన్ని పోషించారో, ఏ శిల్పులు ఏ శిల్పాన్ని మలిచారో, ఏ కళాకారులు ఏ నృత్యాలను ప్రదర్శించారో మనకు సరియైన సాక్ష్యాధారాలు లేకపోయినా, నేటి ఆంధ్రదేశంలో ఉన్న పురాతన దేవాలయాలన్నిటిమీదా