పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/609

ఈ పుట ఆమోదించబడ్డది
భాగవత కథే భాగవతం:

భాగవతమంటే కృష్ణ సంబంధమైన కథలను కేళిక చేయడమే. ఇందులో కృష్ణా సత్యభామల ప్రణయ కలహం ముఖ్యమైనది. దీనినే కృష్ణ పారిజాతమనీ, భామా కలాపమనీ వ్వవహరిస్తారు. ప్రారంభంలో సిద్దేంద్ర యోగి భాగవత సంబంధమైన ఈ భామాకలాప రచన చేసి ప్రచారం చేశారు.

అయితే భామాకలాపాన్ని సిద్ధేంద్రయోగి రచనను కూచిపూడి వీథి భాగవతుల అధిక ప్రచారంలోకి తీసుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సిద్ధేంద్రుల వారి పారిజాతాపహరణానికి తూర్పు వారు ప్రదర్శించే భాగవతానికి వ్వత్యాసం వుంది. కూచిపూడి భామాకలాపంలో కనిపించే దరువులు మొదలైనవి వీరి భాగవతాలలో తక్కువ కనిపిస్తాయి.

బలరామ భుక్త భాగవతం:

తూర్పు వారు ప్రదర్శించే పారిజాతాపహారణం ఆ ప్రాంతానికి చెందిన బలరామభుక్తగారు వ్రాసింది. కథ ఒకటే అయినా పాటలకు సంబంధించిన బాణీ, దరువులూ, నడిపే విధానం, మృదంగ వాయిద్య రీతుల్లోనూ, కూచిపూడి వారి బాణీకి, తూర్పు వీథి భాగవత బాణీకీ చాల తేడా వుంది.

బలరామభుక్త గారి తరువాత ఈ జిల్లాకు చెందిన నరసింగబల్లి వారు, కేశవ పురి వారు, బొబ్బిలి వారు, దువ్వవారు, నెల్లిమర్ల వారు ఇత్యాదులు ఎందరో ప్రసిద్ధ నాట్య శాస్త్ర వేత్తలు, ఈ తూర్పు వీథి భాగవత బాణీకీ కావలసిన కలాప రచనలను చేశారు.

అయితే ఈ నాటికీ వంకాయల బలరామభుక్త వ్రాసిన గ్రంథమే ప్రస్తుతం ప్రచారంలో వుందని చెపుతారు. ఈ సాంప్రదాయం కూచిపూడి వారి బాణీకి భామా కలాపానికి దగ్గరలో వున్నా పాట పాడే బాణీ, దరువు నడిపే విధానం, మృదంగం వాయించే రీతి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆహార్యాది వేష ధారణలో, అలంకారంలో కూడ ప్రత్యేకాత కనిపిస్తుంది.

ముచ్చటైన కథా వస్తువు:

తూర్పు వీధి భాగవత కలాపంలో కథా వస్తువు ఒక ముచ్చటైన సంఘటన మాత్రమే...తన మందిరం నుంచి అలిగి వెళ్ళి పోయిన శ్రీ కృష్ణుని, సత్యభామ రాయ