చెపుతూ, పాంచ భౌతికమైన ఈ శరీరం యెక్క అస్థిత్వాన్ని గూర్చి, పంచభూతముల యొక్క విధులనూ వివరంగా వివరిస్తారు.
పంచ బ్రహ్మలంటే మనువు, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ మొదలైన వారి విధులను గురించి ఈ విధంగా వివరిస్తారు.
మనువుకు ఇనుప పనీ, వద్దు కర్రపనీ, త్ర్వష్టకు ఇత్తడి పనీ, శిల్పికి రాతి పనీ, విశ్వజునికి బంగారు పనీ ఈ విధంగా వేరు వేరు విధులను వివరిస్తారు. తరువాత ఓంకార స్వరూపాన్ని స్తుతిస్తారు.
వారు చెప్పే కథలు పార్వతీ కళ్యాణము, దక్షయజ్ఞము, విశ్వగుణా దర్శనము, వీర భద్ర విజయం, విశ్వకర్మ, బ్రాహ్మణ వంశాగమనము, దేవ బ్రాహ్మణ మాహోత్మ్యము, మూల స్థంభము, సనారి విశ్వేశ్వర సంవాదము, విశ్వ ప్రకాశ మండలము మొదలైన వాటిని కథలుగా చెపుతారు. వీటిన్నిటికి పద్దెనిమిది అశ్వాసాలు గలిగి సంస్కృత శ్లోకాల మయమైన, తాళ పత్ర గ్రంధం, మూల స్థంభం అధారమని చెపుతారు.
ఉదాహరణకు వారి అంబాస్తుతి ఈ విధంగా ఉంటుంది.
- అంబా స్తుతి(కాంభోజి రాగం.)
కంబుకాంధారీరాయాం
కాశీం హరీం రాం
బీంబోధారీ రాం
అంబుజాక్షీవేలా................................॥అంబా॥