పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/596

ఈ పుట ఆమోదించబడ్డది

గంభీర నినాదం రుంజ వాయిద్యం


ఆంధ్ర దేశంలో అన్ని జానపద కళారూపాలతో పాటు, ఈ రుంజ వాయిద్య కళా రూపం కూడ విశిష్టమైంది. అయితే ఈ కళారూపం ఆంధ్ర దేశంలో అన్ని ప్రాంతాలలోనూ వున్నదని చెప్పలేం. కాని విశ్వ బ్రాహ్మణులు ఏ మూల నున్నా ఈ కళా రూపం వారి దగ్గరకు చేరేది.

విశ్వ బ్రాహ్మణులను ఆశ్రయిస్తూ వారిని అరాధిస్తూ వారిపై ఆధారపడినవారు రుంజ వారు. రుంజ అనే వాయిద్య పరికరానికి రౌంజ అనే నామాంతరం కూడ వుంది. దీనికి సంబంధించిన ఒక కథ ఈ విధంగా ప్రచారంలో వుంది.

రౌంజ కాసురుడు:

ఈ రుంజ కథ త్రేతాయుగానికి చెందినది చెపుతారు. ఆ కాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందనీ, అప్పుడు వాయిద్య విశేషాలు ఏమీ లేవనీ, అందువల్ల పార్వతీ దేవి కళ్యాణానికి, వాయిద్యాలు కావాలని విశ్వకర్మను కోరెననీ, అప్పుడు విశ్వకర్మ రౌంజకాసురుడనే రాక్షసుని సంహరించి, వాని చర్మాన్ని రుంజగా చేసి, సప్త తాళాలనూ, ముప్పైరెండు వాయిద్యాలను ఈ రుంజపై పలికించాడనీ,