పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/594

ఈ పుట ఆమోదించబడ్డది

కరణం గారి లెక్క, సెట్టి గారి మాయ కొలతలు, నాయుడుగారి రంకెలు, భుక్త గారి బూకరింపులు, ఇల్లు పట్టిన భుగతమ్మ మణి అచారపు హడావుడి అన్నీ వాలకాలకు ఇతి వృతాలే.

ప్రతి ఏడూ గ్రామ కరణం రాపిడికీ, భుక్తగారి దోపిడికీ అణగారి పోయిన ప్రజలు ఆనాడు ఆ ఆటలో అద్భుతమైన చురక లంటిస్తారు. ఇలా ప్రతి సంవత్సరం గవిరమ్మ సంబరాలూ, రసాత్మకమైన వాస్తవిక జీవైతాలను ప్రతిబింబించే వాలకాలు ప్రదర్శింప బడతాయి.