శాసనాలలో పేర్కొనబడ్డారు. ఆయన ఏలూరు దగ్గర ఉన్న వసంతవాడ గ్రామం లోని శివాలయత్రయానికి, వాద్య, వాదక, గాయక, నటకాచార్య విలాసిని జనభృతి నిమిత్తం 'పవన్ ధూ 'రను ప్రాచీననామం గల వసంతవాడలో కొంత భూమిని దానం చేసి దానశాసనం వ్రాయించి ఆ శివాచార్యులపరంగా ఇచ్చియున్నాడు.
శైవమతం భక్తి సాంప్రదాయంగా వ్వాపించడంతో శివలీలలు పాడటం, అభినయించటం, శివకథలు ఆడటం, వాడుకలోకి వచ్చి నాట్య సంగీత కళలు వృద్ధి పొందాయి. శివాలయాల్లో అంతకు పూర్వం పెద్ద పెద్ద మండపాలుండేవి కావు. ఇప్పుడు వాటిలో నాట్య, సంగీత మండపాలు ఏర్పడినాయి.
ఆ దేవాలయాలలో స్వామి అర్చనావసరాన శివలీలలు పాడి ఆభినయించ డానికి పాత్రధారులు నియమితులై వుండేవారు. స్వామి వారి అంగ,రంగ, వైభోగాల నిమిత్తం శ్రీమంతులు, మహారాజులు, సామంతులు, మాండలికులూ మాన్యాలను దానం చేయడం ఆచారమైంది. ఆనాడు దేవాలయాలు సంగీత, నాట్య కళలనూ, విద్యలకూ ఆధారభూతమైనాయి.
- దేశికవితను పండించిన శైవకవులు:
శైవ, వైష్ణవ మతాల ప్రాబల్యం వచ్చిన తరువాత సాహిత్యంలోనూ, నాటా రచనలోను, గేయ వాజ్మయంలో కూడ పెద్ద మార్పు రాసాగింది. గేయరచననూ, సంగీతానికి తెలుగు భాష అనుకూలంగా వుందడం వల్ల జనసామాన్యానికి అర్థమయ్యే రీతుల్లో శైవకవులు, శైవమత ప్రచారంకోసం, వచన నాటకాల్ని వదిలి పద్యరచనతో కూడుకున్న వాజ్మయాన్ని సృష్టించారు.
అంతేగాక ఆనాడు దేశీయ నాటక రచనకు దారి చూపించిన వారు కూడ శివకవులే, జనసామాన్యాన్ని తేలిక పద్దతుల్లో ఆకర్షించటానికి వారు సంస్కృత నాటాకాల పద్ధతిని మాని, దేసీపద్ధతినీ ప్రారంభించారు.
- పంక్తి బాహ్యులు:
దేశీనాటకాలు మాత్రం ప్రజాసామాన్యంలో ప్రదర్శింపబడేవి. ఈ నాటకాలను శైవమత ప్రచారకులు ఎక్కువ వ్వాప్తిలోకి తెచ్చారు. దేశి నాటకాలు పురాతన కాలం