కత్తిసాము, కర్రసాము ప్రాముఖ్యం తగ్గి పోయిన తరువాత వీటి మీద ప్రజలకు ఆసక్తి తగ్గి పోయిందని డా॥ బిట్టు వెంకటేశ్వర్లు గారు కరీంనగర్ రాష్ట్ర స్థాయి జానపద కళోత్సవాల సంచికలో వుదహరించారు.
ఆనాడు ఈ విద్యకు అధిక ప్రాముఖ్య మిచ్చేవారు. ఈ విన్యాసాలలో పోటీలు ఏర్పరచేవారు. ప్రజలు ఎంతో ఆసక్తితో ఈ ప్రదర్శనాలను ప్రదర్శించేవారు.
ఆంగ్లేయుల కాలంలో కూడ సంస్థానాలలోనూ, జమీందారీలలోనూ ఈ విద్యను పోషించేవారు.
విజయనగర సామ్రాజ్యంలోని సంస్థాన సామంత రాజులు కత్తిసాము కర్రసాములను ఔత్సాహిక ప్రదర్శనలుగా నిర్వహించేవారట.
ఎంతో సాహసవంతంగా ప్రాముఖ్య వహించిన ఈ కర్రసాము, కత్తిసాము విద్యలు వినోదాత్మక ప్రదర్శనలుగా విరాజిల్లాయి.
ఈనాడు వీటికి ఏవిధమైన ఆదరణ లేక పోయినప్పటికీ ఈ ప్రదర్శనాలు ఒక ప్రక్రియగా, ఒక కళగా ప్రదర్శిస్తున్నారు.
ఈ ప్రదర్శనాలు వెనుకటి రోజుల్లో కత్తిసాములో రక్షణ కొరకు కృపాణాలనూ, కవచాలనూ ధరించి సైనికుల్లాగా పోరాటం జరిపేవారు. అయితే ఈనాడు మామూలు వస్త్రధారణతోనే ఈ విద్యను ప్రదర్శిస్తున్నారు.
ముఖ్యంగా కర్రసాములో ఒక కర్రతోనూ రెండు చేతులతో రెండు కర్రలతోనూ ఒకరి కొకరు పోటీ పడి, ఒకరు కొట్టిన దెబ్బను మరొకరు కాచుకుంటూ ప్రేక్షకులకు భయంకలిగే విధంగా ఉధృతంగా కర్రసాము చేసేవారు. అదే విధంగా కత్తి, డాలును ధరించి కూడ అలాగే పోరాటం జరిపేవారు. ఈ పోరాటంలో ఎత్తుకు పై ఎత్తులు, దెబ్బ కొట్టడం, దెబ్బ కాచుకోవడం ఒకరి కొకరు తలపడి ఉధృతంగా పోరాటం జరిపేవారు. ఈ పోరాటంలో కొందరు డప్పు వాయిద్యంతో పోరాటకారుల్ని ఉద్రేకపర్చేవారు. ప్రేక్షకులు, ఈలలతో, కేకలతో ఇరు పక్షాలుగా విడిపోయి ఇరువుర్నీ ఉద్రేకపర్చేవారు.
- టాసా వాయిద్యం:
కర్రసాము, కత్తిసాము జరిపేవారు అడుగులనూ, భంగిమలనూ చాల అట్టహాసంగా చూపించేవారు. అడుగులకు అనుగుణంగా "టాసా" అనే వాయిద్యాన్ని