పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/563

ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యవంత లిద్దరూ ఒకే రకమైన నటనను అభినయిస్తారు. ఏ‍డమచేతిని చెవికి అడ్డంగా గానీ నడుంపైనగానీ పెట్టి, కుడి చేతిని పైకి ఎత్తి కథను వివరిస్తూ కథానుగుణంగా చేతితో అభినయిస్తారు. ప్రధాన కథకుని రాగాన్ని అందరూ అందుకుంటారు. పాత్రకు తగినట్లు స్త్రీ పాత్రల సందర్భంలొ కంఠాన్ని స్త్రీలా అనుకరిస్తారు. చేతులు తిప్పడంలోనూ, మూతి తిప్పడంలోనూ, శోకాలు పెట్టడంలోనూ, సిగ్గును అభినయించడంలోనూ, స్త్రీ పాత్రభినయాన్ని చక్కగా ఆభినయిస్తారు. తాళాలు డోలు మాత్రం ప్రారంభం నుండీ చివరి దాకా ఉపయోగిస్తారు.

ఒగ్గుడోలు నృత్యం:

ఒగ్గు కథలో ఎక్కువ ప్రాముఖ్యం వహించేది ఒగ్గు డోలు. ఇది ఒక మీటరు పొడవుండి గుండ్రంగా వుంటుండి. డ్రమ్ము ఆకారంలో వుండే ఇత్తడి వాయిద్యం. ఈ వాయిద్యాన్ని పూర్వం చెక్కతో తయారుచేసేవారట. రెండు వైపులా మేక చర్మాన్ని అమర్చి తాళ్ళతో బిగిస్తారు. ఇది గంభీరమైన ధ్వనినిస్తుంది. కురుమలూ, గొల్లలూ వివాహ సమయాలలో వీటిని మంగళ వాయిద్యాలుగా భావిస్తారు.

అంతేకాక అమ్మవారి గుడి సంబరాలలోనూ, జాతర్ల లోనూ, పూజా సమయాల్లో శివాలయాల్లోనూ ఏడెనిమిది డోళ్ళను వాయిస్తారు. ఈ వాయిద్యాన్ని వీరప్ప డొల్ల అని కూడ పిలుస్తారు. ఈ డొల్లలు రాయల సీమ లోని, కర్నూలు, అనంతపురం జిల్లాలో కూడ కనిపిస్తాయి. తెలంగాణాలో మాత్రం ఒగ్గు డోలనే పిసుస్తూ వుంటారు.

కథా ప్రారంభంలో ప్రారంభ సూచనగా ఈ వాయిద్యాన్ని వాయిస్తారు. ఈ ధ్వనితో ఊరిలోని వారందరూ కథకు హాజరౌతారు. డోలు వాయిద్యానికి జిల్లేడు, లేదా సీతా ఫలం కర్ర ముక్కలను వాయిస్తారు. ఈ డోలును ఒక్క కథ చెప్పడం తోనే కాక మల్లన్న పండగ సమాయాల్లోనూ, ఊరేగింపు సమయాల్లోనూ జలధికి పోవడం,