పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/535

ఈ పుట ఆమోదించబడ్డది

జంతర్ మంతర్ జంతరు పెట్టె

ఆంధ్రదేశంలో పర్వదినాలలో, జాతర్లలో, తిరునాళ్ళలో ఈ జంతరు పెట్టె పైసా తమాషా చూపిస్తూ వుంటారు. పిన్నలు మొదలు పెద్దలు వరకూ, ఈ వింత తమాషాను చూస్తారు.

పెద్దల కంటే పిల్లల్నే ఎక్కువ ఆకర్షిస్తుందీ జంతరు పెట్టె. ఇది నాలుగు పలకల గల ఒక పెద్ద పెట్టె. ఆ పెట్టెను చూపరులు ఆకర్షించేటట్లు రకరకాల అందాలను చేకూర్చి ఆకర్షవంతంగా తయారు చేస్తారు. ఆ పెట్టెకు మూడు కాళ్ళు గల స్టాండును, చూడటానికి అనువై నంత ఏత్తులో నిలబెడతారు. ఆ పెట్టెకు ఒక ప్రక్కన లోపల చూపించే బొమ్మలను చూడటానికి వీలుగా ఒక రంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. రెండవ ప్రక్కన బొమ్మలు చూపించే వాడు నిలబడి వరుసగా పేర్చిన బొమ్మలను నడుపుతూ వుంటాడు. మరొకడు తాళం కొడుతూ రాబోయే బొమ్మను గురించి కాశీ పట్నం చూడర బాబూ అంటే బొమ్మతో కాశీ విశ్వనాథుని దేవాలయమూ గంగానదీ కనిపిస్తాయి. పాటను బట్టి బొమ్మ తరువాత బొమ్మను చూపిస్తూ వుంటారు. ఒక్కరే బొమ్మను చూడటానికి అవకాశ ముంటుంది. ఇలా బొమ్మను చూపిస్తూ వుంటారు. ఒక్కరే బొమ్మను చూడటానికి అవకాశ ముంటుంది. ఇలా బొమ్మను చూసే వాణ్ణి.