పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/532

ఈ పుట ఆమోదించబడ్డది

గురువు చెప్పే మాటలు:

మన కులవృత్తికి ద్రోహం చేయకూడదు.
ఇతరులను మోసం చెయ్యవద్దు.
అబద్ధం చెప్పొద్ధు, అని పిల్లవాడి నోటినుంచి పలికిస్తారు.
గొరవయ్య కర్తవ్యం:

ప్రమాణం చేసిన పిల్లవాడు ఆ వంశంలో కోటీశ్వరుడు అయినప్పటికీ, సంక్రాంతి పండుగనాడు మాత్రం, గొరవయ్యలా అలంకరించుకుని, అయిదు ఇళ్ళు అడుక్కుని రావాలి. ఇది వంశ పారంపర్యంగా వస్తూన్న ఆచారం. గొరవయ్య వేషధారణ, మెడలో గవ్వల దండను ధరించి, నల్ల కంబళిని శరీరమంతా కప్పుకుని, కుడిచేతిలో డమరుకాన్ని పట్టుకుని ఎడమ చేతిలో పిల్లన గ్రోవి పట్టుకుని కాళ్ళకు గజ్జెలు కట్టి, తలకు కిరీటంలా ఎలుగుబంటి చర్మాన్ని ధరించి, నుదుట బండారు బొట్టు పెట్టి, నడుముకు జింక చర్మంతో చేసిన బండారు తిత్తిని కట్టుకుని ప్రతి ఇంటి దగ్గరా అడుక్కుంటూ, ఇంటిలోని వారందరికీ బండారు బొట్టు పెడుతూ పిల్లన గ్రోవి ఊదుతూ ఇలా పాడుతారు.

శివమల్లేశ్వరా, బండారువయ్యా
కాపాడప్పా, పిల్లలను పెద్దలను దీవించు
గాటెద్దులు కలిగి గూటావులు కలిగి
కోటి సంపదలు కలిగి
కనకపాత్ర గలిగి
మల్లేశునట్లు మగబిడ్డ కలిగి
మల్లిఖార్జున నీ పాదపద్మాలకు
నమస్తే

అని ముగిస్తారు.

డమరుక శబ్దాలు :

గొరవయ్యలు నృత్యం చేసేటప్పుడు పాటలు పాడరు. పాటపాడే సమయంలో డమరుకాన్ని, ఒక ప్రక్క మాత్రమే