పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/531

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రచారానికి అలవాలమైన ఈ కళారూపం ఈనాడు భిక్షాటన కళారూపంగా మారిపోయింది.

గతంలో కుల పెద్దలుగా వ్వవహరించిన వీరు పొట్ట కూటి కోసం, వీథుల్లో పడ్డారు. రాయలసీమలోని అతి ప్రాచీనమైన నృత్య కళల్లో ... గొరవయ్యల నృత్యం ఒక ఉత్తమ కళారూపం.

రక్త తర్పణం:

కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం, ఆలూరు త్గాలూకా "నెరణిక" సమీపంలో వున్న మల్లేశ్వర స్వామి, కురవ కులానికి చెందిన కొంత మందిని గొరవయ్యలుగా సృష్టించాడనీ, వీరి అభిప్రాయం, ప్రతి సంవత్సరమూ దసరా పండుగలకు గొరవయ్యలంతా అక్కడకు చేరి విచిత్రమైన పద్ధతుల్లో పాటలు పాడుతూ, నృత్యం చేస్తారు. వారి శరీరం నుంచి కొంత రక్తం ధారబోసి దేవునికి నైవేద్యం పెడతారు. వీరు నాట్యం చేసే పద్ధతి చాల విచిత్రంగా వుంటుంది. నృత్యాంతాన, కుక్కల మాదిరిగా అరుచుకుంటూ కొట్టుకుంటారు. వీరి సంతానంలో తప్పని సరిగా ఒక పిల్ల వాడికి నృత్యం నేర్పి, తమతో పాటు తిప్పుతారు.

గట్టు మల్లయ్య కొండ:

గొరవయ్యలు కురువ వంశస్థులు, వంశంలో వున్న పెద్దకుమారుడు కానీ, చిన్న కుమారుడు కాని తప్పని సరిగా గొరవయ్య కావాలి. గొరవయ్యను తయారు చెయ్యాలంటే గురువు, లేదా గణాచారి అవసరం. గురువులు కర్నూలు జిల్లా ఆలూరులో గట్టు మల్లయ్య కొండలో ఉన్నారు, గణాచారులు అనంతపురం జిల్లా కాట్నే కాలవలో వున్నారు.

గొరవయ్య కాలంటే పిల్లవాణ్ణి గట్టు మల్లయ్య కొండ మల్లేశుని గుడికి తీసుకువెళతారు. అక్కడ కోనేటిలో స్నానం చేయించి, నల్ల కంబళి పరచి; కూర్చో పెడతారు. పిల్లవాని మేనమామ పాలతో ప్రమాణం చేయిస్తాడు. అప్పుడు గురువు గవ్వల దండతో ముద్రాదానం చేస్తాడు. ముద్ద్రా దానాన్నిపిల్లవాడి మెడలో కటతాడు. గురువు పాదాలకు నమస్కరించి కానుకలు సమర్పించుకుంటాడు. పిల్లవాడికి గురువు ఈ విధంగా ప్రబోధం చేస్తాడని, డా॥చిగిచర్ల కృష్ణారెడ్డి గారు తమ జానపద నృత్య కళ ... గ్రంథంలో ఉదహరించారు.