- గంగా వివాహం:
గంగా వివాహ పదాన్ని పనగాడ సయాసి రాజు గారు 1856 వ సంవత్సరంలో రచించాడు. ఇది స్కాందపురాణం లోని కథ. కాని ఈ పద కవి, ఈ కథను తెలుగు దేశానికి అన్వయింప చేశాడు. ఏలూరులో శంభు దేవుడనే జాలరి పున్నాడనీ అతనికి గంగ జన్మించిందనీ శివుడు వచ్చి ఆమెను వలచి వివాహం చేసుకున్నాడనీ వ్రాశారు.
గంగ వివాహ కథ, పొంగి పారుతున్న గంగ తుంపరలు ఈశ్వరుని వెండి కొండ మీద పడగా ఈశ్వరుడికి కోపం వచ్చి, గంగను భూమిమీద పుట్టమని శపించాడు. భూలోకంలో శంభుదేవుడు చక్రమ్మ అనే దంపతులకు గంగ జన్మించింది. కయ్యాల మారి నారదుడు ఎరుకత వేషంలో వచ్చి గంగకి శివుణ్ణి గురించి చెప్పగా ఆమె శివుణ్ణి వలచింది. ఆ సంగతి తిరిగి వెళ్ళి శివుడికి చెప్పాడు. శివుడు జంగం వేషం ధరించి వస్తాడు. ఆ విధంగా గంగకూ శివునికి వివాహం జరుగుతుంది.
అమెను తలను ధరించి వెండి కొండకు వెళ్ళాడు శివుడు. కాని పార్వతికీ విషయం తెలుస్తుందేమోనని భయం. రహస్యం బయట పడింది. పార్వతికి కోపం వవ్చింది. శివుడు బ్రతిమాలాడాడు. అప్పుడు గంగకు కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళింది.