పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/525

ఈ పుట ఆమోదించబడ్డది

అందర్నీ ఆనంద పర్చిన హరిహరీ పదాలు

ఆంధ్ర జానపదగేయ సాహిత్యంలో హరిహరీ పదాలు కూడ ప్రముఖ స్థానాన్ని అలంకరిస్తున్నాయి.

హరి హరీ నారాయణ ఆది నారాయణా
కరుణించి మమ్మేలు - కమల లోచనుడ ॥హరి॥

హరిహరీ పదాలన్నీ ఈ పల్లవితోనే నడుస్తాయి. ఒకో ప్రాంతంలో, ఒకో పాటా, ఒకో ఆటా, ఒకో కథా, బహుళ ప్రచారంలో వున్నట్లే ఈ హరి హరీ పదాలు కూడ విశాఖపట్టణం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలో విశేష ప్రచారాన్ని కలిగి వున్నాయి. ఈ పేరుతోనే అనేక కథలూ, సుద్దుల రూపంలోనూ చెపుతూ వుంటారు.

వీటినే జంపెలని కూడా అంటారు. హరిహరీ పదాల్లాంటి పాటలే మన యక్ష గానాల్లో కూడ చాలవరకు వ్రాయబడి వున్నాయి. పదాల నడక ప్రారంభం నుంచీ చివరి వరకూ ఒకే వరుసలో నడుస్తుంది. మధ్య మధ్య కథా గమనాన్ననుసరించి వచనంలో తేట తెల్లంగా కథ యొక్క అర్థాన్ని చెపుతారు. సన్ని వేశాలను బట్టి ఇంకా కీర్తనలు కూడా పాడుతూ వుంటారు. కథకుడు పదం పాడితే, మధ్య, ప్రక్కనున్న వంత దారులు ఆఁ__ అంటూ శ్రుతిలో దీర్ఘంగా సాగదీసి శ్రుతిపక్వంగా ఒక గమకాన్ని జత కలుపుతారు.

హరిహరీ పదాలు కేవలం ఎవో జానపద గేయాల్లాగా కాకుండా మన కళా రూపాల్లో అదీ ఒక కళా రూపంగా వెలుగొందుతూ వుంది. వీటి కథల్లో చాల వరకు రామాయణ, భారత కథలే ఎక్కువగా వున్నాయి. భారతం నుంచి నలచరిత్ర, శశి రేఖా పరిణయం, విరాట పర్వం; ఉత్తర గోగ్రహణం మొదలైనవే కాక పాతాళ