పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/519

ఈ పుట ఆమోదించబడ్డది

దొమ్మరోళ్ళ దొమ్మరాటలు

దొమ్మరాటలు పూర్వ కాలం నుంచీ వున్నట్లు 13 వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణంలో

అమరాంగనలు దివి నాడేడు మాడ్కి
నమరంగ గడలపై నాడేడు వారు

పై రెండు పాదముల వర్ణన ప్రకారం, దొమ్మర సానులు వెదురు గడల పైన ఆకాశంలో అప్సరసలు ఆడుతున్నారంత భ్రమను కలిగించేవారట. అంటే వారు వుపయోగించే ఎదురు గడలు అంత పొడవైన వన్నమాట.

దొమ్మర సానులు పురుషులతో పాటు భూమి మీద వివిధ రకాల పిల్లి మొగ్గలు మొదలైన చిత్ర విచిత్ర ప్రదర్శనాలతో ప్రేక్షకుల్ని దిగ్భ్రమలో ముంచేవారు. చూసే వారికి ఆటలు భయాన్ని కలిగించేవి. వారి ఆటలు పాతిన గడమీదనే కాక, గడను పురుషులు ఎదురు రొమ్ము మీద, నొసటి మీద నిలబెట్టి, ఆ గడలపై దొమ్మర సానులతో తమ తమ విద్యల్ని ప్రదర్శింప చేసేవారు.

దొమ్మరి సానుల ఆటను శ్రీ హర్షుడు సంస్కృత నైషధంలో అలంకారికంగా వర్ణించినట్లు శ్రీనాథుడు శృంగార నైషధంలో ఈ విధంగా వర్ణించాడు.

గడసాని గరడీలు:

ఈ సకలావనీ తలము వెక్కటి దాన పరిభ్రమించి య
భాస పరంపరా పరత నభ్రమునన్ విహరింప గోరియో
తాసిక కీర్తి విభ్రమ కలంగరి మన్నటి యంచు చుండు నీ
రాసుతు వంశ రత్నము దిరంబుగ జెంది యమందలీలన్

(శృంగార నైషధం. 5 అశ్వాసము, 118 పేజీ)

అలాగే

సంత నెన్నడో జవ్వన మమ్ము
కొన్న గడసాని ననుంగవ యందలంచితీ