పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/505

ఈ పుట ఆమోదించబడ్డది

జీవిత సరళిలో, వేష ధారణలో దగ్గర సంబంధాలున్న లంబాడీలు, ఇంతకు పూర్వం, మధురాలతో సంబంధాలు లేక పోయినా, ఇటీవల కాలంలో వీరిరువురి మధ్యా వివాహ సంబంధాలు జరుగుతున్నాయి.

ఇష్టమైన గోకులాష్టమి:

మధురాలకు గోకులాష్టమి ఎంతో ఇష్టమైన పండుగ. ఈ పండుగ పర్వ దినాల్లో "లెంగినాఖేల్" అనే ఆటను తమతమ గూడేలలో ఆడుతూ వుంటారు. మగవారు తప్పెటల్నీ, డోలక్ లనూ,నగారాలనూ వాయిస్తూ వుంటే, మహిళలు లయ బద్ధంగా చప్పట్లు చరుస్తూ, అడుగులలో అడుగులు వేస్తూ, వలయాకారంగా, గుండ్రంగాతిరుగుతూ, కృష్ణ సంకీర్తనాన్ని ఆశువుగా ఆహ్లాదంగా వివరిస్తారు. అయితే స్త్రీలు ప్రదర్శించే నృత్యంలో పురుషులు పాల్గొనే అవకాశముండదు. అందుకు కారణం, పది సంవత్సరాల వయసున్న బాలుడు కృష్ణుని పాత్ర ధరిస్తే, స్త్రీలంతా గోపికల నాట్యవిన్నాసాన్ని చేస్తారు. ఆ కారణంవల్ల వారి వారి పురుషులకు ఈ నాట్యంలో తావువుండదని మధురాలు చెపుతారు.

వీరు దసరా, దీపావళి, సంక్రాంతి పందుగలను వైభవంగా జరుపుకుంటారు. ఆటపాటలతో, ఆనందడోలికల్లో ఊగుతారు.

ముఖ్యంగా "ఖద్ డమారణ్" అనే కన్యల పండగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇది తెలంగాణాలో బహుళ ప్రచారంలో వున్న బతుకమ్మ పండగకు చాల సన్నిహితంగా వుంటుందట. అయినా అది ఒక ప్రత్యేక కళారూపంగా వుంటుందట.

గోండ్లు మొదలైన గిరిజనుల మాదిరే చక్రాల బళ్ళను ఉపయోగిస్తూ ఉన్న వనరులతో వ్వవసాయం చేసుకుంటూ జీవిస్తారు. వీరు స్నేహానికి ప్రాణమిస్తారు.


గిరిజనుల సంగీత వాయిద్యాలు


అంధ్రదేశంలో అనేక జానపద కళా రూపాలతోపాటు, అడవుల్లో కొండల్లో నివసించే గిరిజన ప్రాంతాల్లో నివశించే గిరిజనులకు కూడ సంస్కృతీ పరమైన అనేక నృత్యాలూ గేయాలూ, అనేక వాయిద్య పరికరాలు వున్నాయి.

వీటిని ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ విభాగమైన గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ, వ్వవహారాల సంస్థ పరిసోధనాత్మకమైన కృషి చేస్తున్నదనీ, గిరిజన