వారి జీవన సరళీ, అచార వ్వవహారాలు, వేష భాషలూ అన్నీ గిరిజన జీవితానికి దగ్గరగా వుంటాయి. వీరు అన్ని విధాలా, లంబాడీలను పోలి వున్నప్పటికీ వీరికి వారికీ చాల తేడా వుంది.
వీరు సంచార జాతులనీ, ఉత్తర ప్రదేశం నుండి వచ్చారనీ అంటారు కానీ, మేను ఇక్కడి వారమేనంటారు మధురాలు. అదిలాబాద్ జిల్లలోని ఉట్నూరు, "భోద్" అడవుల్లో ఎక్కువగా కనిపించే మధురాల జీవన విధానం వేష భాషలు విచిత్రంగా కనిపిస్తాయి. అందంలోనూ, వస్త్ర ధారణ లోనూ, ఏ ఇతర జాతి స్త్రీలకూ తీసిపోరు.
వీరు మొగల్ చక్రవర్తి ఔరంగ జేబు కాలంలో సైన్యానికి ఆహారం అందించే వారని, ప్రసిద్ధ సామాజిక శాస్త్ర వేత్త గిరిజనుల ఆరాధ్య దైవం "హేమండార్సు" అంటారు.
మధురాల సిరోజాల అలంకరణ ఎంతో రమణీయంగా వుంతుంది. స్త్రీలందరూ మామూలుగా సిగలు చుడతారు కాని మధురాలు పొడుగాటి కొమ్ములాగా అలంకరిస్తారు. ఈ అలంకారం చూడ ముచ్చట గానేవుంటుంది.