పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/501

ఈ పుట ఆమోదించబడ్డది
బోడె దింసా:

బోడె అంటె ఘనమైనదని అర్థం. గ్రామ దేవత అయిన "నిసాని దేవత" పూజ సమయంలో ఈ నృత్యం చేస్తారు. కనుక దీనిని బోడె దింసా అంటారు. అన్ని వాయిద్యాలూ వుధృతంగా వాయిస్తూ వుండగా ఈ నృత్యం ప్రారంభమౌతుంది. కుడివైపున పురుషులూ, ఎడమ వైపున స్త్రీలూ వరుసగా నిలుస్తారు. వీపుమీద ఒకరి చేతులు మరొకరు దృఢంగా పట్టుకుంటారు. వరుసలో కుడి వైపున మొదటి నిలిచే వ్వక్తి కథా నాయకుడు, నెమలి ఈకల పించాన్ని పట్తుకుని లయ బద్ధంగా అడుగులు వేస్తూ, నృత్యాన్ని నిర్వహిస్తాడు. అలాగే ఎడమ వైపు చివర నుండే వ్వక్తి కూడ కథానాయకుడికి తోడుగా నృత్యాన్ని నిర్వహిస్తాడు. అందరూ వర్తులాకారంగా తిరుగుతూ ...మధ్య మధ్య, హుషారుగా, హేయ్, హేయ్, హోయ్, హోయ్ అంటూ ఆనందంగా కేరింతలు కొడుతూ, చివరికి బారుగా నిలుచున్న స్థితికి చేరుకుంటారు.

గుండేరి దింసా:

గుండేరి ఒక స్త్రీ పేరు. ఈ నృత్యంలో పాల్గొనే పురుషుడు తనతో కలసి అడుగు వేయవలసిందిగా ఒక పాట రూపంలో, మహిళా బృందాన్ని ఆహ్వానిస్తాడు. అందు వల్లనే ఈ నృత్యాన్ని "గుండేరి నృత్యం" అంటారు. ఈ నృత్యంలో వెనకకూ ముందుకూ ధృఢంగా అడుగులు వేస్తూ కదం త్రొక్కుతూ