పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/487

ఈ పుట ఆమోదించబడ్డది

వంత పాడతారు. పాట పాడుతూ వలయాకారంగా తిరుగుతూ వెనుకకూ ముందుకూ అడుగులు వేస్తూ వంగుతూ లేస్తూ చేతులను ఆడిస్తూ గజ్జెల కాళ్ళతో చిందులను త్రొక్కుతారు. ఒక ప్రక్క వాయిద్య మ్రోగుతూనే వుంటుంది. నాయకుడు చేతిని వూపుతూ చూపుడు వ్రేలును చెవిలో పెట్టుకుంటూ లయాన్వితంగా రాగం తీస్తారు. పాదలు పైకెత్తి ముని కాళ్ళమీద అరచేతితో కొడుతూ పెద్దమ్మ స్వామి దగ్గరకు పోయి నమస్కారం చేస్తాడు.

కథకుణ్ణి అనుసరిస్తూ వంతలు నేత్రానందంగా నృత్యం చేస్తారు. వారి ముగ్గురి నాట్యమూ త్రిమూర్తుల నృత్యంగా దర్శనమిస్తుంది. ఈ సమయంలో కొందరికి పూనకం వస్తుంది. పూనకం వచ్చిన వారి చేత వేపాకులు తినిపించటం, కల్లు ముంత లోని కల్లును వేప ముంతతో అందరి మీదా చిలకరించటం గ్రామాన్ని రక్షించమని గాయకుడు దేవతల్ని ప్రార్థిస్తూ వచ్చి చిందులు వేస్తూ గేయాలనూ, కథా గేయాలనూ పాడుతారు. ముఖ్యంగా వారు గానం చేసే కథా గేయాలు, పెద్దమ్మ కథ _చల్లారమ్మ కథ _ యల్లమ్మ కథ వీరు చక్కగా అలంకరించుకుని గ్రామ ప్రజల ముందు, ఆరు బయలులో ఆహ్లాదంగా నృత్యం చేస్తారు. గ్రామ ప్రజలు ఎంతగానో ఆనందిస్తారు. సంతోషంగా వారికి కానుకలు ముట్ట చెపుతారు.

కథను మూడు రోజులు మొదలు తొమ్మిది రోజుల వరకూ పొడిగించి చెప్పగలరు. కథ చెప్పే ప్రతి రోజూ, పెద్దమ్మ స్వామికి పూజలు చేస్తూ, ఆ మహాదేవిని కొలుస్తూ గ్రామస్థుల చేత కొలిపిస్తూ గ్రామాన్ని కాపాడమని ఆసాదుల మధ్య వర్తులుగా గ్రామ ప్రజల ఆర్తనాదాన్ని దేవతకు అందచేసే మాతలుగా వుంటున్నారు.

వేషధారణ:

ఆసాది కథకుకు మోకాలి దాకా పంచ కట్టి, కథ చెప్పే వ్వక్తి కథకుడు మాత్రం నల్ల కోటు ధరించి, ఎర్ర పాగా చుట్టి వెనుక కుచ్చు వదిలి, నడుము కట్టుతో నుదుట బంగారు బొట్టు పెట్టి చేతిలో వేప మండల్ని పట్టుకొని ఝుళిపిస్తూ కథలు చెపుతారు. కథా ప్రారంభంలో పెద్ద స్వామికి నైవేద్యం పెట్టె సందర్భంలో వారు కల్లు త్రాగుతారు.