పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/482

ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సుద్ధులకు ప్రత్యేకమైన ఛందస్సు వుండదనీ, దానికి కూనపదమనీ, జానపద ఛందస్సుతో పదం చాల ప్రసిద్ధమైనదనీ తాళ్ళపాక అన్నమయ్య క్షేత్రయ్య సేనయ మంత్రి మొదలైన వారు ఈ పదరచనలో ప్రసిద్ధులనీ, ఈ పదాలలో కూడ అనేక రకాలున్నాయనీ, అందులో ఒకటి కూన పదమనీ, కూనపదమంటే చిన్న పదమనీ శ్రీ రాంబట్ల కృష్ణమూర్తి గారు నాట్యకళ, జానపద సంచికలో వివరించారు.

గొల్ల సుద్దులన్న ఎక్కువగా కూన పదాలు గానే వుంటాయి. ఈ పదాన్ని ప్రధాన గాయకుడు ఆలపిస్తే ప్రక్కనున్న ఇద్దరు వంతలూ, ఆ పదాన్ని ఆఁ అంటూ సాగ తీసి చెవికి చేయి కప్పి పాడ్తారు. ఈ పదాల్ని గొల్లలు గొఱ్ఱెలను కాస్తూ వాటిని రాత్రిళ్ళు తోడేళ్ళు బారి నుండి కాపాడటానికి రాత్రి తెల్లవార్లూ పాడుతూనే వుంటారు.

హరి హరీ నారయుడ
ఆది నారాయుడ
కరుణించి మమ్మేలు
కమల లోచనుడ.

అంటూ ప్రారంభించి కృష్ణ గాథలు చెపుతారు. యాదవుడి గోవులను, మాధవుడు గాయంగ మాధవుడు మచ్ఛావతారమైనాడు. అని దశావతార సంకీర్తన పాడుతారు.

గొల్లసుద్దుల ప్రారంభంలో కథకులు రంగ స్థలం మీదికి సరాసరి రారు. ప్రేక్షకుల మధ్య నుంచే ఆమూల నుంచి ఒకరు, ఈ మూల నుంచి ఒకారు టుర్ కీ అంటూ గొఱ్ఱెలను అదిలించినట్లూ, తప్పిపోయిన గొఱ్ఱెల కోసం వెతికినట్లు, తోడేళ్ళను కేకలతో అదరగొట్టినట్లు హడావిడి చేసి రంగం మీద కొస్తారు.

వచ్చిన తరువాత వారూ వీరూ వచ్చారా అని పరామర్శ చేసి హాస్యపు ఛలోక్తులతో ప్రేక్షకులను ఆకట్టుకుని నృత్యంతో కథను ప్రారంబిస్తారు. వంతశ్రుతినే కథకుడు శ్రుతిగా ఆధారం చేసు కుంటాడు. ఒకప్పుడు

వీణలను ఉపయోగించే వారట వాయిద్యంగా. ఆ వీణ ఎటువంటిదో మనకు ఆధారం లేదు. ఆ తరువాత చేకోలను ఉపయోగించేవారు. వీరి కథల్లో పెద్ద డోలు కూడ వుంటుంది. ఇక వేష ధారణలో కథకునికి పెద్ద తలపాగా, వెండి బిళ్ళల మొలత్రాడు, చెవులకు దిద్దులు, చేతులకు తెల్లని మురుగులు, భుజంమీద గొంగడి చేతిలొ