మీద సాష్టాంగ పడి పోతారు. పంబల వారిని ప్రశ్న లడుగుతారు. గంగమ్మ ముందు దుత్తల్ని పగుల గొడతారు. ఊరంతా ఈ కోలా హలంలో మునిగి పోతారు. ఈ సందడిలో ఎందరో మత్తుగా త్రాగి చిందులు, గంతులూ వేస్తూ అట్టహాసం చేస్తారు.
గంగమ్మను కదిలించగానే జ్యోతిని ఎత్తుకుని ముత్యాలమ్మ గుడిని చేరిన రజకులు నిద్ర మత్తులో త్రాగిన మైకంలో, ఎర్రబడ్డ కళ్ళతో జ్యోతి ఎగదోస్తూ, అది ఆరి పోకుండా కాపాడుతూ వుంటారు.
ఆయా వీధుల వారు ఒక్కొక్క గంగమ్మను రథంపై పెట్టుకుని బయలుదేరుతారు. ఆ రథాలను విద్యుద్దీపాలతో అలంకరించి, బాజా బజంత్రీలతో తప్పెట్ల వాయిద్యాలతో ఆటలతో పాటలతో ముత్యాలమ్మ గుడి వద్దకు చేరుకుంటారు. ఈ వుత్సవం ఒక పట్టాభి షేక మహోత్సవంలా వుంటుంది. రజకులు మాత్రం సాంప్రదాయపు కాగడాల తోనే వుంటారు.
- ఎరుపెక్కిన ముత్యాలమ్మ:
దేదీప్య మానంగా ప్రజ్వరిల్లుతున్న ఏడు జ్యోతుల వెలుతురు పసుపు కుంకాలతో ఎరుపెక్కిన ముత్యాలమ్మ ముఖం ఎఱ్ఱగా మారిపోతుంది. భయాన్నీ భక్తినీ కలుగ జేస్తుంది. పూజారి ఆమెను ప్రసన్నం చేసు కోవడానికి ప్రయత్నం చేస్తాడు.