పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/436

ఈ పుట ఆమోదించబడ్డది

కుండలాకారం చేయబడే నర్తనం కాదు, బృంద నర్తనం అసలే కాదనీ, ఏక పాత్ర నృత్య కేళిక విధానం కుండలి అని అంటారు రామకృష్ణగారు.

కుండ నృత్యంలో, నారాయణ కరణము మత్తల్లికాచారి __ లక్ష్మీ శతాళంతో ప్రదర్శిత మౌతుంది.

గొండ్లి, గోడులు:

గొండ్లి అంటే అది గోండులచే చేయబడే నృత్యంగా పేర్కొన్నారు. గోండులు అతి ప్రాచీనమైన తెగకు సంబంధించిన వారు. వీరిది ప్రాచీనమైన సంస్కృతీ వికాసం గల నాగరికత, వీరు అడవులలో నివసించే జాతి. వీరిలో రాజ గోండులు ముప్పై ఆరు సంస్థానాలను స్థాపించుకుని "చత్తీసుఝడ్" పేరుమీద రాజ్యపాలన చేశారు.

ఆ ప్రాంత మంతా ఈ నాటికిమధ్య ప్రదేశ్ లో ఛత్తీస్ ఝడ్ గా పిలువబడుతూ వుంది. ఆంధ్ర దేశాన్ని ఆనుకొని వున్న ప్రాంతాలైన, చాందా, సిరువంచా, బస్తర్ మొదలైన సంస్థానాలను రాజ గోండులు పాలించారు. ఆనాడు ఆంధ్ర దేశాన్ని పారిపాలించిన రాజులకూ, వారికీ సన్నిహిత సంబంధాలుండడం వల్ల గోండులలో వున్న నృత్త రీతులు ఆంధ్ర దేశంలో కూడ ప్రచారమయ్యాయి. పల్లెల్లో నివసించే గోండులు ప్రదర్శించే నృత్యాలన్నిటిలోనూ, ఖర్మ నృత్యం చాల ప్రాముఖ్యం వహించిందట.

ఖర్మ నృత్యం:

ఖర్మ నృత్యమంటే వర్షరుతువు ప్రారంభమయ్యే రోజుల్లో పంటలు బాగా పండాలని రైతులు చేసే ధర్తీమాత ఆరాధనా నృత్యమిది.

ఖర్మ నృత్యంలో బాగా చిగురించిన విప్పకొమ్మను తీసుకువచ్చి, ఒక కొత్త గుడ్డలో వుంచి వారి వారి ఇళ్ళలో వుంచుతారు, వారు అనుకున్న రోజున పెద్ద పండుగ చేస్తారు. అందరూ ఆనందంగా విందు భోజనాలు చేస్తారు. తరువాత, జంత్ర వాయిద్యాలు, మృదంగ శబ్దాలు మ్రోగు తుండగా, స్త్రీలూ పురుషులూ కలిసి ఆ విప్ప కొమ్మల చుట్టూ తిరుగుతూ, ప్రేమ గీతాల్నీ, ప్రకృతి రామణీయక గీతాల్నీ పాడుతూ అద్భుతంగా నృత్యం చేస్తారట. దీనిని వారు ఖర్మనృత్య మంటారు. ఇది ఒక్క