పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/416

ఈ పుట ఆమోదించబడ్డది

అద్దమ్మ రాతిరేళ నిద్రా పొద్దమ్మా॥
పాపిష్టి సెందురుడు పట్టపగలయ్యె॥
               ॥శ్రీరామా రామ శరణయ్య॥
దురుదేవి సుక్కలు గక్కన్న మునిగె॥
దిగ్గా బగ్గన్న లేచి దియ్య ముట్టించె॥
అది దొంతి ఇది దొంతి నడి మీద దొంతి
నడి దొంతి రాజనమే సేటాకు బోసే
సేటాతో రాజనాల్ రోటికి బోసే
చేడెలిద్దరు గూడి చెరిగి దంచంగ
పణతు లిద్దరు గూడి పాడి దంచంగ
కాంతారో నీ కండ్ల కాటి కెక్కడిదీ
సెక్కులకు గంధమ్ము ఎక్కడిదె చేడి
కొమ్మరో కొప్పూన పూలెక్కడివె
మాపటికి మీ మరిది వచ్చిండే నక్కా
రాతిరికి మీ మరిది వచ్చిండె నక్కా
సుళ్ళయితే నామాట సూసి రావమ్మ
పట్టె మంచం మీద పండినాడమ్మ.

అని వివరించింది. అలాగే మరో ఉదాహరణ: అనంత పురం జిల్లాలో వెన్నా నదీ తీరంలో వున్న జారుట్ల సుప్రద్ధ శైవ క్షేత్రం. దీనికి దక్షిణ కాశీ అనే పూరు కూడ వుంది. జారుట్ల రామ లింగేశ్వరుడు క్రింది పాటలో నాయకుడు నాయిక ఎవరో అజ్ఞాత యువతి.

మారుట్ల పొలమూలోన
జారుట్ల రాముడూ, జారుట్ల రాముడూ
పట్టె మంచం పానుపు మింద పూజలు గొన్నాడే
మిట్ట మధ్యాన్న వేళ
నట్టింట నాది కొంగు, నట్టింట నాది కొంగు
పట్టవద్దుర నాది కొంగూ పాదెం బట్టేనూ
పడమట నాది ఇల్లు