అనంతపురం ఆణిముత్యం మెరవణి గద్య
మెరవణి అంటే వధూవరుల ఊరేగింపనీ, అనంతపురం, బళ్ళారి, కర్నూలు జిల్లాల లోనూ మెరవణీ అనే ఒక ప్రత్యేకమైన వేడుక వాడుకలో వుందనీ, పెళ్ళి వుత్సవానికి సంబంధించిన గద్య మెరవణీ గద్య అనీ, తలంబ్రాల సంబరం తరువాత రాత్రిపూట మెరవణి బండి మీద నూతన దంపతులు ఊరేగేటప్పుడు తమకు గల చీరలు నగలు పది మందికీ ప్రదర్శించటానికి ఇదొక మంచి అవకాశమనీ, ఊరేగింపులు, ఓ వాద్య బృందం నాయకుడు గద్యను చదువుతాడనీ, దీనినే పొగిడింపులు, పొగడింఫుల గద్దె అంటారనీ, ఇలా చదివే అంగారకులకు 'ఓజు' అన్నది బిరుదు నామమనీ (తూమాటి దోణప్ప గారు తమ జానపదస కళా సంపదలో వివరించారు.
- ఆడవారూ, ఆడంబరాలు:
ఉభయపక్షాల స్త్రీలకూ ఇదొక మంచి అవకాశం. బంగారు జస్రీ పట్టు చీరలతో రెప రెపలాడుతూ, ఏడు వారాల నగల నిగనిగలతో ప్రతి ఒక అమ్మా కోవెలలోని అమ్మలాగా, మహా శిల్పి చెక్కిన జగదేక సుందరి బొమ్మలాగా ఊరేగింపులో కనిపించాలని ఉవ్విళ్ళూరుతుంటుంది. ఇంట లేకపోయినా, పొరుగింటి నుంచో, పుట్టింటి నుంచో ఎరువు తెచ్చిన బరువు సొమ్ముల్ని ఒంటినిండా ధరిస్తారు.
ఊరేగింపులో రెండెడ్ల బండిని సాధారణంగా వాడతారు. కాని నేటి నాగరికత ననుసరించి టాపులేని మోటారు కారు వాడుకలోకి వచ్చింది. బండికి చేసే అలంకారాన్నీ గూర్చీ, ఏడ్లకు చేసే ముస్తాబును గూర్చీ ఒక వ్వాసమే వ్రాయవచ్చంటారు దోణప్పగారు.
కొమ్ములకు కుప్పెలు, రంగు రంగుల ఊదా దారాల గుత్తులు, మోరకు కుచ్చుల పణకట్లు, పిబోరాలు, మెడలో రకరకాల గంటల పట్టెడలు, వీపున ఖరీదైన మొఖ్మల్ గౌనులు, ఇలా ఎన్నో రకాల అలంకరించిన ఎడ్ల బండి మీద నట్ట