పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/348

ఈ పుట ఆమోదించబడ్డది

మండలీక కృష్ణ, అల్లాడ బాల శంకర రావు, డొక్కా అనంత రామ మూర్తి, చిన్నబ్బాయి, కట్టా వీరయ్య, సుబ్బారెడ్డి, నూకల అప్పన్న శాస్త్రి, సలాది నాగరాజు, పిళ్ళా అప్పారావు, ఆడబాల కృష్ణమూర్తి, గంగాద్రి, వింజమూరి లక్ష్మణ రావు, వడ్డే రాజయ్య, లక్ష్మణ్, యాదగిరి, పి. ప్రభాకర రావు ఎ.ఎ. శర్మ, జిన్నాభట్ల రామం, కుసుమంజ ఝాన్సీ, తాపీ రాజమ్మ, వీరమాచనేని సరోజని, చింతల కోటేశ్వరమ్మ, మహంకాళి లక్ష్మి తులసి, మండలీక రామం, బళ్ళ అబ్బరాజు మొదలైన వారంతా బుర్ర కథల్లో వంతలుగా ప్రసిద్ధి చెందినట్లు నదీరా గారు ప్రపంచ తెలుగు మహా సభల్లో వెలువరించిన బుర్ర కథలు గ్రంథంలో ఉదహరించారు.

ప్రత్యేక వంతలు:

సాంప్రదాయమైన బుర్రకథ వాయిద్యాలతో పాడు హర్మోనియం, తబలా మొదలైన వాయిద్యాలను ప్రవేశపెట్టి కథలు చెప్పిన వారిలో నిడదవోలు అచ్యుత రామయ్య, సుంకర కృష్ణ, మాధవ రావు, కుమ్మరి మాష్టారు, డి.ఎ. నారాయణ, కప్పగంతుల రామం మొదలైన వారు కథలు చెప్పగా మల్లిక్ కూచి వీరభద్ర శర్మ, నలాది వెంకన్న, మండలీక కృష్ణ, భాస్కరం మొదలైన వారు వంతలుగా వ్వహరించారు.

కొందరు బుర్రకథా రచయితలు:

ప్రజాకవి సుంకర సత్యనారాయణ, కాకుమాను సుబ్బారావు, షేక్ నాజర్, వానమామలై వరదాచార్యులు, మాచిరాజు లక్ష్మీపతి, కోగంటి గోపాల కృష్ణయ్య, కవి కుమార్, జంపన చంద్రశేఖర రావు, కొసరాజు రాఘవయ్య చౌదరి, లక్ష్మీకాంత మోహన్, తెల్లాకుల వెంకటేశ్వర గుప్త, రుక్కాభట్ల విధుమౌళి శర్మ, పేరి సుబ్బారావు, తిరునగరి టి. రామాంజనేయులు, నీలా జంగయ్య, శ్రీపాద రామ మూర్తి, వారణాసి వెంకట నారాయణ శాస్త్రి, రామ కవచం సత్యనారయణ, పి. బాలకృష్ణ