పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/327

ఈ పుట ఆమోదించబడ్డది

పూజిస్తారు. వీరు ఎంతమంది భార్యలనైనా చేసుకోవచ్చు. వీరందరూ శైవ మతస్థులైనప్పటికీ లింగధారణలో కొంతమందికి పట్టింపు లేదు.

ఉత్తమ కళారూపం:

ఈ జంగం కథలను ప్రజా ప్రబోధానికి ఆయుధంగా వుపయోగించారంటే అందులో ఒక విశేషం లేక పోలేదు.బుర్రకథ ఫణితులు చాల వుత్తేజ కరమైనవీ, వుద్రేకమైనవీ, అన్ని రసాలనూ తేలికగా ప్రజా హృదయాల్లో చొప్పించగల శక్తి ఈ జంగం కథలకుంది. వీర రసం ద్వారా ప్రజలను వుద్రేక పరచవచ్చును. కరుణరసం ద్వారా ఏడ్పించ వచ్చును. హాస్య రసంద్వార కడుపుబ్బ నవ్వించవచ్చు. శృంగార భీబత్స రసాలకు ప్రాముఖ్యం

బుర్రకథ

తక్కువైనా నవరసాలూ ఈ జంగం కథా విధానంలో మిళితమై యున్నాయి. సంగీతం, సాహిత్యం, నృత్యం, వాద్యం, శిల్పం, తాళం, లయ, అభినయం, ఆహార్యం, మొదలైన హంగులన్నీ ఈ కథలో తొణికిసలాడుతూ వుంటాయి. ఈ కథల్లో వుపయోగించే గుమ్మెటలు వీరణపు మ్రోతలను గుర్తుకు తెస్తాయి. జంగం కథా కళారూపంలో ప్రజలను మేల్కొల్పే మహాత్తర శక్తి వుంది. ఈ నాటికీ ఈ కళారూపం విద్యాధికుల నుండి అతి సామాన్యుల వరకూ ఆనందింప జేయగల ఉత్తమ జాన పద సంగీత కళారూపంగా తయారైంది.