పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/295

ఈ పుట ఆమోదించబడ్డది

తోటి మానవుడు ఎదురై వస్తే
దూర దూరమని తొలగి పోదురు ॥తాలే॥

కుక్కంటే కాలభైరవుడనీ, కోతంటే హనుమతుడనీ, పంది అంటే వరాహవతారమని గ్రహించాలి.

కులాల గురించి:

శునక గర్భమున జన్మించిన ఆ శైనకముని
గోత్రమ్ము చెప్పుతా -మండూకమునకు
పుట్టినట్టి ఆ మాండవ్యుని కులమేదో తెల్పుడి ॥తాలే॥

రకరకాలైన కులాలు లేవనీ, రంగు రంగుల మతాలు లేవని, కలిగిన వారిది గొప్ప కులమా, లేని వారిది లేని కులమా అంటూ.

వశిష్టుని గురించి:

తల్లి తొలుత లంజ తన యాలి మాదిగ
తాను బ్రహ్మడనగ తగునె జగతి
తపస్సు వల్ల ద్విజుడు తర్కింప కులమేది
విశ్వదాభిరామ వినుర మేమ.

అలాగే శూద్రుల గురించీ, బ్రాహ్మణుల గురించీ.

జన్మానా జాయతే శూద్రః
కర్మాణా జాయతే ద్విజః
వేదభ్యాసే విప్రశ్యాతేః
బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణః

అంటూ, ఇలా అనేక గ్రంథాలలోని పద్యాలూ, శ్లోకాలూ ఉదహరిస్తూ, కుల వ్వవస్థను తూర్పార బడుతుంటే అతని శాస్త్ర విజ్ఞానానికి ఆశ్చర్య మేస్తుందని, పడాల రామ కృష్ణా రెడ్డి గారు విశాలాంధ్రలో ఉదహరించారు.