పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/278

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజలకు నచ్చిన పగటి వేషాలు

జానపద కళల్లో మరో జాతీయ కళ:

నాటకం, సినిమా, రేడియో, టీవీలు, అభివృద్ధి పొందిన ఈ నాటి దశనుంచి, కొంచెం వెనక్కు వెళ్ళి ఆలోచిస్తే మనకు జానపద కళారూపాలలో విరివిగా కనిపించేవి పగటి వేషాలు.

పట్టపగలు వేషాలు వేసుకుని, హావభావాలను బలికిస్తూ, రాగ మేళ తాళాలతో, పండిత పామరులను మెప్పించి, మురిపింప జేయటం పగటి వేషధారులకు వెన్నతో పెట్టిన విద్య.

అభినయంలో, వాక్చాతుర్యంలో కొందరిని అనుకరించడం అది కూడా గుర్తు పట్ట లేనంతగా ఆయా పాత్రల్లో లీనం కావడం వారి ప్రత్యేకత. ఆయా వేషాల ద్వారా, సంఘంలోని దురాచారాల్నీ, బలహీనతల్నీ వ్వంగ్యంగా ఎత్తి చూపటం వీరి వృత్తి లోని మూల సూత్రం.

పురాణకాలం నుంచీ:

పురాణకాలంనుంచీ ఈ పగటి వేషాలు వేయటం ఆనవాయితీగా వస్తోందని పెద్దల అభిప్రాయం. దశరథుడు సంతానం కోసం పరితపిస్తున్నప్పుడు బుడబుక్కల వేషంలో వచ్చి, యాగ రహస్యం చెప్పాడనీ, ఈ వేషధారణ కోసం డుంబకాసురుడు అనే రాక్షసుని చంపి, ఆతని దేహాన్ని బుడబుక్కగాను, నరాలు రాళ్ళుగాను, మెడను మైనంగానూ విష్ణువు ఉపయోగించాడని చెపుతూ వుంటారు.

ఒకనాడు భారత దేశంలో స్వతంత్ర సామంత రాజుల పరిపాలనలోనూ, చిత్ర విచిత్ర వేషాలు వ్వాప్తి లోకి వచ్చాయని ప్రతీతి. గూఢచారులుగా మారు వేషాలు ధరించి, వర్తమానాలు చేరవేసే బారులుగానూ, రత్నాలు పచ్చలు కెంపులు అమ్మే వ్వాపారులు గాను, రాణులు ధరించే ఖరీదైన చీరల వర్తకులుగానూ చిత్ర విచిత్రమైన