పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/255

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రదర్శనలు. ఈ రోజుల్లోనే కూచిపూడివారి ప్రదర్శనల ప్రభావం మగ్గుపట్టి తగ్గుతూ వచ్చింది. అంతే కాక ధార్వాడ వారు వచ్చి వెళ్ళిన తరువాత వారి ప్రభల ప్రచారంతో ఆంధ్రదేశ ప్రముఖ పట్టణాలలో ఎన్నో విద్యావంతుల నాటక సంఘాలు బయలుదేరి, అచ్చంగా ధార్వాడ వారి అడుగుజాడల్లో ప్రదర్శన లిచ్చాయి. ఈ పరిస్థితుల్లో కూచిపూడి వారి ప్రదర్శనాల మీద మోజు బాగా తగ్గిపోయింది.

యామిని కృష్ణమూర్తి

1930 నాటికి నాటకాల ఉధృతం కూడ కొంతవరకు తగ్గి సినిమాల ప్రభావం బహు ఎక్కువైంది. ఆ సినిమా ప్రభావంతో రంగస్థల నాటకాలు కూచిపూడి వారి నాటకాలు కూడా బాగా దెబ్బతిని పోయాయి.

మేలుకోలు - క్రొత్త మెరుగులు:

1880 - 1930 మధ్యకాలంలో కూచిపూడివారు ఏటి కెదురీదలేక తమ ప్రదర్శనాలలో కూడ కొన్ని మార్పులు తీసుకువచ్చాడు. రంగస్థల నాటకాలు