పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/254

ఈ పుట ఆమోదించబడ్డది
క్షీణదశ:

ప్రాచీన నాట్య కళ ప్రచారమవడానికి కూచిపూడి వారు ఎంతో కృషి చేశారు. కాని ఎంత చేసినా, పాత పరిధిని మించి క్రొత్త వరిధిని చేపట్టలేక పోయారు. పౌరాణిక గాథలు తప్పితే చారిత్రిక, సాంఘిక ప్రదర్శనాలను తయారు చేయలేక పోయారు. కాగా రాను రాను రాజుల ఆదరణ తగ్గింది. పరిణామ స్థితిగతుల ననుసరించి వారి భాగవతాలు ముందుకు రాలేదు. వారు కాలంతోపాటు కాలు వేయ లేకపోయారు. అవి ప్రేక్షకులకు కూడా కొంతవరకు విసుగు పుట్టించాయనే చెప్పాలి.

అయ్యంకి తాండవకృష్ణ
శుక్లపక్షం నుంచి కృష్ణపక్షం:

కూచిపూడి వారి నాట్యకళా సాంప్రదాయాలు ఆంధ్రదేశమంతటా, వెలిగినంత మట్టుకు క్రీ॥ శ॥ 1180 వరకూ వేయి వెలుగులతో వెలుగొందాయి. ఆ రోజుల్లోనే ధార్వాడ నాటక సమాజాలు ఆంధ్ర దేశానికి వచ్చి ప్రదర్శనలిచ్చి, వేనోళ్ళ పొగడబడుతూ వచ్చాయి. దేశకాల లెరిగి రంగస్థలంలో వారు అనేక మార్ఫ్పులు తీసుకువచ్చారు. చెమ్కి దుస్తులతో రమణీయంగా ప్రదర్శనలిచ్చారు. తహతహతో మార్పు కావాలనుకుంటున్న ప్రజలకు ఒక నూతన ఆనందాన్ని కలుగ జేశాయి ఈ