పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/242

ఈ పుట ఆమోదించబడ్డది

ఇనుపకోటా, ఇత్తడి కోటా
వెండికోటా వెలసినాదీ
ఏడుకోటల నట్టనడుమా
ఒంటిస్థంభం మేడమీదా
పవ్వళించి నే నుండగా
మాయదారి కర్ణకరుడు
మత్తు చల్లీ నన్ను తెచ్చే.

అంటూ దరువుతో లీలావతి పాత్ర ధారిణిపై కథ అంతా వివరిస్తుంది.

తంత్రమూ, తంతూ

దాదినమ్మ ఉంటూ వచ్చిన పందిరిపట్టి మంచం ఒక వ్యక్తి పరుండడానికి

సరిపోయేటంత పొడవూ, వెడల్పూ కలిగి వుంటుంది. ఆ మంచానికి ఒక చిన్న పందిరికి చాందినీ దోమతెర, లోపల పందిరికి వ్రేలాడుతూ రకరకాల పన్నీటి బుడ్లు, మంచం వెదురు కర్రలతో చెయ్యబడి చాల తేలికగా వుంటుంది. లీలావతి పాత్రధారి మంచాన్ని రొమ్ముకు దిగువ కదలకుండా గట్టిగా కట్టివేసు కుంటాడు. నడుము కింది భాగమంతా పాదాల వరకూ కాళ్ళు కనబడకుండా మంచం కోళ్ళ చుట్టూ మంచానికి జాలరు దించి వుంటుంది. చూచేవారికి మంచం అలంకారం ఎంతో శోభాయమానంగా ననిపిస్తుంది. కాళ్ళ వద్ద మంచం మీద రెండు లక్కకాళ్ళు బయటకి కనబడేటట్లు అమరుస్తారు. ఇలా కాళ్ళు అమర్చడం వల్ల మంచంలో