పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/232

ఈ పుట ఆమోదించబడ్డది

వాఙ్మయ కారుడు. ఆంధ్రుల నాట్యకళా సాంప్రదాయాలలో క్షేత్రయ్య మువ్వ గోపాల పదాలు ఒక మెట్టు లాంటివి.

ఏ హంగామా లేని వీధి నాటక రంగస్థలం:
వీథి నాటకంలో యముడు

కూచిపూడి వీథి నాటకాలు అనాటినుంచీ ఈ నాటివరకూ వీధుల్లోనే ప్రదర్శింపబడుతూ వున్నాయి. నాలుగు వీథుల కూడలి గాని, ఊరిమధ్య పెద్ద బజారులో గాని ఊరి వెలుపల బయలు ప్రదేశంలోగాని ఈ ప్రదర్శనాలు జరిగేవి. ఈనాటి మాదిరి ఆనాడు రంగస్థలాలు లేవు. ఎత్తైన ప్రదేశమే రంగ స్థలంగా ఎంచుకొనేవారు. లేనట్టయితే మట్టిని దిబ్బగా పోసేవారు. ఇంగా జనమమ్మర్థం ఎక్కువగా వుంటే ఎత్తుగా బల్లలతో ఒక బల్లకట్టు నిర్మించేవారు. పైన తాటి ఆకులుగాని, ఈత చాపలు గాని కప్పేవారు. ఈ నాటితెరలు ఆనాడు లేవు. మామూలు కలంకారీ అద్దకం బొమ్మల దుప్పటి లాంటిది ఇరువురు వ్యక్తులు చెరో ప్రక్క పట్టుకుని నిలబడేవారు. ఈ నాటి లైట్లు ఆనాడు లేవు. కేవలం నూనెకాగడాలమీదా, విలాయి కర్రల మీదా