పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/200

ఈ పుట ఆమోదించబడ్డది

కథను ఎన్నుకుని, ఆయాపాత్రలకు వెనుక భాగాన మాటనూ పాటనూ కూర్చి, తెర చాటున దీపాలు పెట్టి, తోలుబొమ్మల ఆటల మాదిరి ప్రశ్నించేవారు. ఈత మట్ట పిడిని పట్టుకుని ఈ బొమ్మలను చక్కగా ప్రదర్శించి తద్వార వచ్చిన డబ్బుతో తమ జీవనాన్ని సాగించే వారు. అలా ఈత మట్టల బొమ్మలాటలను ప్రదర్శించిన సురభి వారు ఆ తరువాత తోలు బొమ్మలాటల్ని ప్రదర్శించారు.

ఊచబొమ్మలాట:

తోలు బొమ్మలు, కొయ్య బొమ్మలు, బుట్టబొమ్మలుతో పాటు ఈత మట్టల బొమ్మలాటలను, ఊచ బొమ్మలాటలను కూడ ఆంధ్ర దేశంలో ప్రదర్శించారు.

క్రిందనుండి ఊచలతో బొమ్మలాడించటం వల్ల వీటికి ఊచబొమ్మలని పేరు వచ్చిందని కె.వి. గోపాల స్వామి గారు నాట్యకళ జానపద వుత్సవాల సంచికలో ఉదహరించారు.

ఈవిధంగా బొమ్మలాడించే పద్ధతి బెంగాల్ లో ప్రచారంలో వుంది. ఆంధ్రదేశంలో ఒకప్పుడు ఊచబొమ్మలాటలను ప్రదర్శించినా ఇటీవల కాలంలో వాటి జాడ అంతగా తెలియటం లేదు.

కర్ర బొమ్మ తలను తయారు చేసి సన్నకర్ర నొకదానిని క్రిందకు వుండేటట్లు ఈ రంధ్రంలో అమరుస్తారు. బొమ్మను పట్టుకుని ఆడించడానికి ఇది అనువుగా ఉపయోగపడుతుంది.

అంగ విభాగంలో మొండెము, నిటారుగా వున్న కర్రకు సమాంతరంగా తగిలించిన చెక్క భుజాలు వుంటాయి. త్రాళ్ళ బొమ్మల మాదిరి చేతుల్ని అమర్చుతారు. వాటి అరచేతులకు సూత్రాలు తగిలించి క్రింద నుంచి ఆడిస్తారు. ఈ బొమ్మలకు కాళ్లు కానీ, పాదాలు కాని వుండవు. కర్ర బొమ్మల అవయవాలను కూర్చటం కష్టంతో కూడు కున్న పని.

తల గుల్లగా వుంటుంది. దానిని మెడమీద అమర్చుతారు. తల, మెడ, భుజాలు ఏకాంతంగా వుంటాయి. తలలోని నిర్దిష్ట భాగంలో అమర్చిన త్రాళ్ళు క్రిందకు వ్రేలాడటానికి వీలుగా ఒక్కోసారి కర్రలకు బదులుగా సన్నటి గొట్టాలను వాడటం కూడా కద్దు. త్రాళ్ళు లాగటం ద్వారా