పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/198

ఈ పుట ఆమోదించబడ్డది

అలాగే ఆంధ్ర దేశంలో బాపట్ల ప్రజానాట్యమండలి కార్యకర్తలైన మురళీధర రావు, జొన్నలగడ్డ జోషీ మొదలైన వారు ఇతర కళారూపాలతో పాటు ఈ ఛాయా నాటికలను దేశానికి, ప్రజలకూ ఉపయోగపడే కథా ఇతి వృత్తాలను తీసుకుని ఎంతో ముచ్చటగా ప్రదర్శించారు.

మాత్రుకలు తోలుబొమ్మలే:

చాయా నాటికలకు మాత్రుకలు తోలు బొమ్మలే. తోలు బొమ్మలాటల్లో కేవలం తోలుతో తయారు చేయబడిన బొమ్మలను మనుషుల సహాయంతో ఆడిస్తారు. ఒక్కొక్కరు ఒక బొమ్మ, మరికొందరు రెండు బొమ్మలను రెండు చేతులతోనూ ఆడిస్తూ వుంటారు. కాని ఛాయా నాటికల్లో, కేవలం ఆయా పాత్రలకు సంబంధించిన వ్వక్తులు తెర వెనుక నుండి నటిస్తూ వుంటే వారి నీడలు, వారి అభినయం తెల్లని తెరమీద ఎంటో స్ఫుటంగా కనపడతాయి. కాని ఛాయా నాటికల్లో పాత్రలు ధరించిన దుస్తుల యొక్క రంగులు గాని ముఖానికి పట్టించిన రంగులు గాని కనబడవు. అలా కనపడవు కనుకనే ఏ విధమైన రంగులూ, రంగుల దుస్తులూ వుండవు. ఇందుకు కారణం ఏ మంటే తోలుబొమ్మ తెరకు అంటి పెట్టుకుని వుండడం వల్లా ఆ బొమ్మ వెనుకనే బలమైన దీపపు కాంతి వుండడం వల్లా బొమ్మలు పలుచని చర్మంతో తయారు చేయడం వల్లా, బొమ్మలో చిత్రించిన అన్ని రంగులూ మనకు స్ఫుటంగా గోచరిస్తాయి. కాని ఛాయా నాటికలో నటులు తెరకు సాధ్యమై నంత దూరంగా వుంటారు. వారికి కొంచెం దూరంగా ప్రొజెక్టు చేసే కాంతి వంతమైన లైటు వుంటుంది. నటీనటులు ముందుకు వచ్చిన కొలదీ నీడలు పెద్దవిగాను, వెనుకకు పోయిన కొద్దీ నీడలు చిన్నవిగానూ కనబడతాయి. ఇందులో కూడా ఆయా రంగులు చూపించ వచ్చు. ఈ రంగులు లైటుకు దగ్గరగా చూపించినట్లైతే రంగులు వివరంగా కనపడతాయి. ఉదాహరణకు ఒక ఇల్లు దహనం అయిపోయి నట్లూ ఆ మంటలు సహజంగా వున్నట్లూ చూపించ