- తోట మావుళ్ళు:
మావుళ్ళు, శ్రీ తిరుపతి శ్రీనివాస చర్మ చిత్రకళా సంస్థను స్థాపించి, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోనూ, దూరదర్శన్ లోనూ , రామాయణ, భారత, కథా ఇతివృత్తాలను సమర్థవంతంగా ప్రదర్శిస్తున్నారు. వీరు మారేడు పాకలో జన్మించినా, మాధవ పట్నంలో స్థిరపడి ప్రదర్శనాలను ఇస్తున్నారు.
- తోలుబొమ్మల తయారీ కేంద్రం:
రాష్ట్ర వ్వాపితంగా బోలు బొమ్మల తయారీలో అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని "నిమ్మలకుంట" పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుంది. అనంతపురం జిల్లాలోని సుమారు అయిదు వందల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. మండల కేంద్రమైన గోరంట్ల "కళ్యాణ దుర్గం" మండలంలోని, అవులన్న, దుద్దేకుంట, పిల్లల పల్లి, అయ్యగారి పల్లె, ధర్మవరం మండలంలోని నిమ్మల కుంట, రాళ్ళ అనంతపురం రాయదుర్గం మందలంలో సోమలాపురం, "చదం, జుంజురం పల్లీ" బొమ్మహాళ్ మండలంలోని ఉడేగోళం, మల్లాపురం, బ్రహ్మసముద్రం మొదలైన గ్రామాలలో బొమ్మలాట కళాకారులు ఎక్కువగా వున్నారు.
- ఛాయా నాటికలు:
తోలుబొమ్మలాటకలకు సైదోడులే ఛాయా నాటికలు. బొమ్మలాటల అనంతరం వచ్చిన పరిణామమే ఈ ఛాయా నాటికలు. వీటినే షాడో ప్లేస్ అంటారు. ముఖ్యంగా ఈ ఛాయా నాటికలు దేశం మొత్తంలో చాల తక్కువ మందే ప్రదర్శిస్తున్నారు. మన ఉత్తమ కళారూపాల్లో ఛాయా నాటికను కూడ ఒక వుత్తమ కళాఖండంగా ఎంచవచ్చు. ఈ ఛాయా నాటికలు ఇతర దేశాల్లో ముఖ్యంగా అమెరికా, ఇంగ్లండు దేశాల్లో సాంకేతికంగా బాగా అభివృద్ధి పొందాయని ప్రతీతి.
ఛాయా నాటికలు మనదేశంలో సుప్రసిద్ధ నర్తకుడు ఉదయశంకర్ తన నృత్య ప్రదర్శనాలతో పాటు ఈ ఛాయానాటికను కూడా వ్వాప్తిలోకి తీసుకవచ్చాడు. ఈయన ఛాయా నాటిక ద్వారా బుద్ధుని జీవితాన్ని ఎంతో నిపుణంగా ప్రదర్శించాడు. ప్రేక్షకులలో ఎంతో అనుభూతి కలిగించాడు.