శిల్పులు చెక్కిన చెక్క బొమ్మలాటలు
ఏ దేశంలోనైనా నాటకానికి పూర్వరంగం వీథి నాటకాలూ, చెక్కబొమ్మలూ, కొయ్య బొమ్మలూ, పేడబొమ్మలూ, లక్కబొమ్మలూ అని మనం తెలుసుకోవచ్చును; 'కాళిదారు' 'భవబూతి' 'బాణుడు' మొదలైన వారంతా వ్రాసిన సంస్కృత నాటకాలకు నాంది ఈ కొయ్య బొమ్మలూ, భాగవతాలనే ప్రతీతి కూడ వుంది.
ఈ నాడు మనకున్నది నాటక రంగం. ఆనాడు వారి నాటక రంగస్థలం వీధులే. విగ్రహాలమీద నమ్మకం వచ్చిన తరువాత, దేవతల క్రింద, దేవుళ్ళ క్రింద బొమ్మల పూజలు వచ్చిన అనంతరం వారికి ప్రియమైన భక్తియుతమైన బొమ్మలకు చక్కగా రంగులు దిద్ది, దీపపు స్తంభాల వెలుగురులో ఈ కొయ్యబొమ్మలను ఆడిస్తూ వుండేవారు.
ఈ బొమ్మల నిర్మాణం తేలికగా వుండే కొయ్యతోనూ, పేడతోనూ ఆడించడానికి వీలుగా వుండేంత తేలిక వస్తువులతో తయారు చేసుకునేవారు. దసరాకు పిల్లలు ఆడించుకునే హనుమంతుడి బొమ్మల్నీ, సంక్రాంతికి పెట్టే బొమ్మల కొలువులూ, పెళ్ళిళ్ళకు ఆడించే బుట్టబొమ్మలూ, దేవుళ్ళ వాహనాలైన గరుత్మంతుడు, నెమలి, హంస మొదలైన బొమ్మలను గుర్తుకు తెచ్చుకోవచ్చు.
- ఈనాటికీ, ఈ ఆటలు:
ఈనాటికీ ఆంధ్రదేశంలో అక్కడక్కడ తోలుబొమ్మలాటల్ని, బుట్టబొమ్మలాటల్ని, కొయ్య కావళ్ళవారి ప్రదర్శనలనూ చూస్తూనే వున్నాం. కాని కొయ్య బొమ్మలాటల్ని మాత్రం ఎక్కడా చూడలేక పోతున్నాం. అయితే ఈ కొయ్య బొమ్మలాటలు ఆంధ్రదేశంలో ప్రదర్శింపబడి, ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి.
అనంతపురంజిల్లా హిందూపురంలో ఒకప్పుడు ఈ కొయ్య బొమ్మలాటలను ప్రదర్శించేవారు. ఈ కట్టెబొమ్మలు కళ్ళతో కూడ అభినయం చేయగలంతటి పనితనాన్ని నిపుణులైన గ్రామ వడ్రంగులు తయారు చేసేవారు. ఇది చాల