పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/168

ఈ పుట ఆమోదించబడ్డది

అనే యక్షగానాలను వ్రాయించారు. ఈ సమయంలోనే గోవర్థనంగారి గొల్ల కలాపం, రూప్ఖాన్ పేట రత్నమ్మగారి కురవంజి వెలువడ్డాయి.

యక్షగాన రచనలో అందెవేసిన చేయి:

20వ శతాబ్దం నాటికి తెలంగాణాలో యక్షగానాలు రచనలోనూ, ప్రదర్శన లోను గణతికెక్కాయి. పల్లె గ్రామాలలో ప్రజలు పదాలు కట్టి పాడుకుంటూ వుండేవారు. "కాంభోజరాజు", "బాలనాగమ్మ " "పెద్దబొబ్బలిరాజు కథ" "అరెమరాఠీల కథ" మొదలైన యక్షగానాలు బహుళ ప్రచారాన్ని పొందాయి. చెర్విరాల భాగయ్యగారు ప్రదర్శన యోగ్యమైన యక్షగాన రచనలో అందెవేసిన చేయిగా పేరు పొందారు. ఈ యన రచించిన యక్షగానాలు 32. ఈయన అనేక మంది యక్షగాన కవులకు గురుతుల్యుడుగా నిలబడ్డాడు. యక్షగాన కవుల్లో ప్రసిద్ధులైన వారు బూరుగు పల్లి సోదరులు. వీరి కృతులను నాటకాలనే వ్వవహరించారు.

పట్లోరి వీరన్నగారి "రైతు విజయం" సామ్యవాద సిద్ధాంతానికి అనుగుణంగా రచించబడింది. తెలంగాణాలో యక్షగాన వాఙ్మయమూ, యక్షగాన ప్రదర్శనలూ ఆలస్యంగా ప్రారంభ మైనప్పటికీ, ఆంధ్రదేశపు యక్షగాన చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాయి.

అంధకవి రాసిన వంద యక్షగానాలు:

ఆంధ్రదేశంలో యక్షగానాల యుగం అనంతంగా నడిచింది. కొన్ని వందల సంవత్సరాలు రచనలోనూ, ప్రదర్శనలోనూ రాజ్యమేలాయి. ఎందరో మహామహులు, పండితులు మొదలు జానపద రచయితలవరకూ యక్షగానాలను వ్రాశారు. అయితే ఒకే వ్యక్తి వంద యక్షగానాలను వ్రాసిన కవులు కనబడరు. కాని వంద యక్షగానాలను వ్రాసిన ఒక మహాకవి ఏ వెలుగు చూడంక, అంధకవిగా అజ్ఞాతంగా వుండిపోయాడు.


బెల్లోజు రమణాచారి: సాహిత్యాన్ని మధిస్తే రమణాచారి లాంటివారు ఎందరు కాలగర్భంలో కలిసిపోయారో చెప్పలేం. మెదక్ జిల్లా, దుబ్బాక మండలంలోని రామేశ్వరపల్లి గ్రామం రమణాచారి జన్మస్థలం. 77 ఏళ్లు గల