పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/166

ఈ పుట ఆమోదించబడ్డది

ఈ యక్షగానాలు ముఖ్యంగా సర్కారు జిల్లాలలోనూ, తెలంగాణా మండలంలోనూ, ఒరిస్సా సరిహద్దుల్లోనూ, దక్షిణ దేశం తంజావూరు, మధుర, పుదుక్కోట మొదలైన ప్రదేశాల్లో తెలుగు మాట్లాడే ప్రతి చోటా ప్రదర్శించబడ్డాయి. ఆయా ప్రాంతాల మాండలిక శబ్దజాలం ఎంతో ఆ యక్ష గానాల్లో వుంది.

యక్షగాన ఇతి వృతాలు కేవలం పురాణ కథలకే కట్టుబడక తాత్కాలిక విషయాలకు కూడ ప్రాముఖ్యతమిచ్చాయి.

రకరకాల వస్తువులతో ఆ నాటి రాజుల ఆచార వ్వరహారాలు, ఆహార వివరాలు, కొలువూ, సింగారం, వివిధ రాజుల ఉద్యోగుల వేషధారణ, వివాహాది సందర్భాలలో పురోహితుల సంభావన తగవులు, ముత్తైదుల ముచ్చట్లు మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తాయి.

ఆంధ్రదేశంలో యక్షగాన ప్రదర్శనాలు బహుముఖంగా ప్రర్శించబడ్డయి. ఆనాటి ప్రదర్శకులైన శ్రీనాథుని జక్కుల పురంద్రి__ ప్రతాప రుద్రుని వుంపుడుగత్తె మాజల్దేవి, భాగోతుల బుబ్బుగాడు, పెందెలనాగి దోరసముద్రపు నటులు, తాయికొండ నాటక సమాజ ప్రదర్శకులు ఆదర్శప్రాయులు.

కోలాచలం వారి వివరణ:

సుప్రసిద్ధ నాటక రచయిత కోలాచలం శ్రీనివాసరావు గారు 1911 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రతిక ఉగాది సంచికలో యక్షగానాలను గురించి ఈ విధంగా వివరించారని చింతా దీక్షితులుగారు (ప్రజావాఙ్మయంలో) ఉదహరించారు.

నన్నయార్యుని మొదలుకొని 19 వ. శకం అంతము వరకు నాంధ్రమున నాటకుములు లేవని పలువురు పండితులు వాకొనుచున్నారు. ఇది విశ్వసనీయము గాదు. ఆంధ్రనాటక సాంఘికు లనేకులుండిరి. వారు భాగవత, భారత, రామాయణాది గ్రంథసంబంధ కథలను సంపూర్ణముగా నాడుచుండిరి. గోపికాలీలలు, పారిజాతాపహరణము- విష్ణుమాయా విలాసము, సైధవ వధ-కీచకవధ -ద్రౌపదీ వస్త్రాపహరణము - హరిశ్చంద్ర, నలచరిత్రలు -సారంగధరకుమార రామ చారిత్రలు -లేపాక్షి రామాయణము -ధర్మపురి రామాయణము మొదలగు