పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/138

ఈ పుట ఆమోదించబడ్డది

106

జానపద కళారూపాలు


బహురూపాలే పగటి వేషాలు:

అయితే బహురూపం అంటే ఇదీ అనే నిర్వచనాన్నిచ్చే గ్రంథాలు లేనందువల్ల బహురూపం అంటే ఇదీ అని, దీని స్వరూప స్వభావాలు ఇలా వుంటాయనీ నిర్వచించటానికి మనకు తగిన ఆధారాలు లేవు. అయినా ఇంతమంది బహు రూపాన్ని విర్వచించడం వల్ల అది మనకు తెలియని ఒక అద్భుత కళారూపంగా పేర్కొనవచ్చు. ఇంతకు పూర్వం బహురూపాన్ని గురించి లాక్షిణికు లందరూ బహు రూపులు అన్నపదానికి సరియైన నిర్వచనం ఇవ్వక ఎవరికి వారు తప్పుకున్నారు. కాని

కర్ణాటకలోనూ, మహారాష్ట్రలోనూ బహురూపుల్ని గురించి వర్ణించినవారు, బహురూపాలను ధరించేవారే. బహురూపాలని నిర్థారించారు. అంటే బహురూపాల ప్ర్రతిబింబాలే పగటి వేషాలు.