ఈ పుట ఆమోదించబడ్డది

కొరవి శాసనము

51

తాను చేజిక్కించుకొనెను.కొద్ది వ్యవధిలోనే వేములవాడ రాజైన రెండవ అరికేసరి గోవిందుని పరిమార్చి అతని ప్రత్యర్థియగు మూడవ అమోఘవర్షునికి రాష్ట్రకూట రాజ్యమిప్పించెను.


క్రీస్తు 933-934 సంవత్సరములో వేంగి,ముదుకొండ, రాష్ట్రకూట రాజ్యములలో నింత కల్లోలము జరిగెను.మూడు రాజ్యములలోను రాజులు మారిరి.వేంగిలో యుద్ధమల్లుడు పోయి రెందవ భీముడు రాజయ్యెను.రాష్ట్రకూటమునకు గోవిందు డు హతుడై మూడవ అమోఘవర్షుడు(బద్దెగుడు)రాజయ్యెను.మధ్యనున్న ముది కొండలో గొణగ య్య పారిపోయి వేములవాడ చేరగా అతని తమ్ముడగు నిరవ ద్యుడు వేంగి రాజగు ఇమ్మడి భీముని ప్రాపుతో అధికారము పొంది యీ కొరవి శాసనమును వేయించె ను. ఆ సందర్భమున కొరవిలో తన యధికారము ప్రతి ష్ఠించుచు అచటి స్థానిక నాయకుడైన నల్లమేడెయ కొడుకు పెద్దనను రావించి "నీవు నాకు చాల సహాయ మొనర్చితివి గనుక,దానికి ప్రతిపలముగ నేదియైనను కోరుకొనుము ఇత్తును."అని యడిగినట్లు ఈ శాసనములో ఉన్నది.దానికి జవాబుగ పెద్దన సవినయముగ "నీ సంపదయంతయు నాకున్నట్లే గనుక వేడు కొనవలసిన దేదియు లే"దనును. అంతే కాక"కొరవిసీమ ముదుకొండ సలుకుల దే" అనిచెప్పి వరమించును.అంటే ఆ వంశ ము వారెవరైన తాను వారికి విధే యుడుగనే యుందునని స్థానిక నాయకునిచే వాగ్దానము చేయించుకొని అన్న యగు గొఝగయ్య రాజూమందున్న కొరవికి తానే యధికారి ననిపించు కొనును. అన్నగా రిదివరలో కొరవి ప్రజలనుండి ఆనాయకున కిచ్చిన ఆదాయము లేవిగలవో అవి అన్నియు మరల తానుకూడ నిరవద్యుడు స్థిర పఱచును.ఇది రెండవ భాగ ములోని చరిత్ర.ఇది చాల చిక్కులతో గూడి యున్న ది. కనుకనే చరిత్ర పరిశో ధకులకు గూడ సరిగా బోధపడుటలేదు.రెండు పెద్ద రాజ్య ముల మధ్య జరిగిన పోరాటములో మధ్యనున్న చిన్నరాజ్యము పడిన యిక్కట్లు, ఆసందర్భ ములో ఈ చిన్న రాజ్యమును దక్కించుకొనిన నిరవద్యుడు తన యధికారమును స్థాపిం చు కొనుటను తెలుపుటకై చేయించిన శాసానమిది.చాళుక్య మొదటి భీముని పట్టాభిషేక వృత్తాంతముతో ప్రారంభమై రెండవభీముని పట్టాభిషేకముతో నంతమగు చున్నది.అందువలన ఏభీముడు శాసనములో చెప్పబడుచున్నది వ్యక్తముగాక పరిశోధకులు సందేహపడుచుండిరి. గొణగయ్య,అతని తమ్ముడు నిరవద్యులలో ఎవరి.