ఈ పుట ఆమోదించబడ్డది

కొరవి శాసనము

49

వేంగి రాజ్యమున కభిషిక్తుడగు సమయములో రాష్ట్రకూట రెండవ కృష్ణుడు దండెత్తి వచ్చి రాష్ట్రమును బీభత్సమొనర్చెను.అప్పుడు ముదుకొండ చాళుక్య వంశ్యుడగు కుసుమాయుధుడనే రాజు రాష్ట్రకూట కృష్ణునితో తనశక్తి కొలది పోరి వేంగిదేశము ను కాపాడి భీమునికి పట్టాభిషేకము నిర్విఘ్నముగ జరిపించెను.ఈ యంశముతో మన కొరవి శాసనం ప్రారంభమగును.మరల కొద్ది కాలమునకే రాష్ట్రకూట కృష్ణుడు దండెత్తి వచ్చుచు త్రోవలో ముందుగ ముకొండ రాజ్యమును నాహుతి గొనెను.ఆ యుద్ధము లో కన్నర బల్లహుని(కృష్ణరాజు)చేతజిక్కి ముకొండ చాళుక్యరాజయిన కుసుమాయు ధుడు మడిసెను.ఈ వంశము నీ ప్రాంతమున నెలకొల్పినది బాదామి చాళుక్య సంత తిలోని వాడైన రణమర్ధుడను రాజు.తాను పట్టము గట్టు కొనునపుడు రాజ్యాధికార సూచకముగ మెడయొందొక కణ్ఠియను అలంకరించు కొనె ను.దానికి రణమర్ధకణ్ఠియ యనుపేరు.అతని సంతతిలో రాజూమునేలు రాజులెల్లరు దానిని రాజలాంఛనముగ ధరించుట ఆచారమై యుండె ను. కుసుమాయుధుడు రణభూమిలో చనిపోగా మృత దేహము శత్రువుల వశము కాకుండు లోపుగనే శిరమును,దానితోపాటు అతడు ధరించిన రణమర్ధ కణ్ఠియను అతిధైర్య పరాక్రమ ము లతో పోరి అతని పెద్ద కొడుకగు గొణగయ్య కాపాడ గలిగెను.లేనియెడల శత్రువులు తమచే జయింపబడిన ప్రధాన నాయకు లగు రాజ సేనానాయకుల శిరములను తమ విజయసూచకముగ ఊరేగించి అవమాన పఱచెదరు.అంతేకాక వారి ముఖ్యములగు రాజలాంఛనము లను తాము స్వీకరించి ఆ రాజ్యమును తాము లోబరచుకొన్నట్లు ప్రకటిం చుకొందురు.అందుచే రాజు లు స్వయముగ యుద్ధములో పాల్గొనునపుడు తమమృతదేహముల కట్టి యవమా నములు జరుగకుండ కాపాడుటకై తమ వెంటనే ప్రత్యేక రక్షకులను ఉంచుకొందురు. ఈ సందర్భములో కుసుమాయు ధునికి, అట్తి రక్షకుడుగ తనపెద్దకొడుకైన గొణగయ్య యే ఆయాపదలో శరీరమునుండి శిరమును,రాజలాంఛనమగు రణమర్ధకంఠియను కాపాడె ను.వెంటనే తానా కణ్ఠియను ధరించి రాజపదవి స్వీకరించి అదే యుద్ధ రంగమున శత్రువును పారద్రోలి విజయలక్ష్మిని సంపాదించి ముదుకొండ రాజ్యము ను నిలబెట్టగలిగెను.దీనికంతకు చాళుక్య భీముని రక్షించుట గూడ ప్రధానమైనది గనుక అతని సేనలు ప్రక్కనే సహాయముగ నిలబడినవని వేరే చెప్పనక్కర

[4]