ఈ పుట ఆమోదించబడ్డది

పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము

23


గోత్రము కాదగును. ఇచట గమనించ వలసిన దేమన ;భారద్వాజ ' అని, పుణ్యకుమారుని సంస్కృత శాసనాల్లో అనేక మార్లు వస్తుంది.అయినా యిక్కడ తెలుగుతనము ఉండాలని ప్రాకృతరూపాన్ని అనుకరించి 'పారదాయ 'అని వాడెను.


'కిఱెవురు 'అనే పదానికి అర్థము తెలియుట లేదు.తిప్పలూరు లోనే భూమిదానం చేయబడింది.ఇట్లు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చే భూమిని 'పన్నస'అంటారు.పన్నాస,పన్నవిస అనురూపములలో కూడనిది ప్రాచీన తెలుగు శాసనములందు కనుపించును.


'కొణ్డకాత్తి೯క 'అను పదంలో 'కొణ్డ'అంటే సరిగా తెలియదు.తిథి, వరాలు, నక్షత్రము, హోర చెప్పబడినవి.పుణరుపుష్యం అంటే పునర్వసు నక్షత్రమని అర్థము.తమిళంలో కూడా దీనిని 'పునర్పూశం'అంటారు. సీమవారమనిన్నీ ,బృగస్పతిహోర అనిన్నీ చెప్పబడి నవి. శాసనాల్లో వారము,హోర చెప్పుట యిదే మొదలనిపిస్తుంది.కనీసం వారము పేరు చెప్పుట కూడ ఇంతకు ముందు శాసనాల్లో కానరాదు.


ఏబది అని సంఖ్య మాత్రమే చెప్పబడింది.సందర్భమును బట్టి 'మఱుతర్లు 'అను భూపరిమాణముగా గ్రహించవలెను.చామణకాలు అనే ఉద్యోగియొక్క 'ధ ' అంటే 'ధర్మము 'అని ప్రాకృతశాసనాల్లో సూక్ష్మముగా వ్రాయుట కలదు.కనుక అట్లే యిక్కడకూడ గ్రహించవచ్చును.


'రేనాణ్డేళుచుండగా' అనుటను బదులు 'రేనాణ్డేళుచు'అని వ్రాయటము, తుదిలో 'చామణకాల(ధర్మము)'అని క్రియ లేకుండా వాక్యం ముగియుట ఇవి రచనలోని లోపములు.వాక్యరచన సరిగా రూపొందలేదని స్పష్టంగా తెలుస్తోంది.వీరిశాసనాలన్నీ యించుమించుగా ఇట్లే యుండును.కొన్నిపదా లకి సరిగా అర్థం తెలియక పోవటమేగాక వాక్యాల్లో కర్త,క్రియ,కర్మలను తెలుపు పదాలు కూడ స్పష్టంగా ఉండవు.క్రొత్తగా భాషను తయారు చేసు కొనే కాలమది.ఈ మాత్రం శాసనం వ్రాయటమే చాలా గొప్ప ఆనాడు.


ఈ పుణ్యకుమారుని కొడుకు మొదటి విక్రమాదిత్యుడు,ఇతని కొడుకు శక్తి కుమారుడు,ఇతని కొడుకు రెండవ విక్రమాదిత్యుడు.ఇతని కొడుకు సత్యా