ఈ పుట ఆమోదించబడ్డది

18

ఈ శాసనంలో సమాప క్రియ లేకున్నను క్రియాజన్య విశేషణముతో గూడిన కర్మాంత వాక్యములు మూడు కలవు.శాసనము పూర్తిగా లభించుచున్నది కనుక కొంత పరిశీలింపదగియున్నది.

1.ఎరికల్ముత్తురాజుల్ల కుణ్డికాళ్ళు నివబుకాను ఇచ్చిన పన్నస-అనిమొదటి వాక్యము.ఈ వాక్యము లో 'నివబుకాను'అనుభాగమర్థమగుట లేదు.'నివంబుకానునెవంబుకాను' అని దీనిని ప్రకటించి న పై జెప్పిన విద్వాంసులు కొంత సరిపెట్టిరి.ప్రస్తుతము మనకు వేఱర్థము తోచుటలేదు గనుక దానినట్లే యంగీకరింతము.'ఎరికల్ముత్తురాజుల్ల' అనునది పథమాంతమో షష్ఠ్యంతమో తెలియదు. 'కుణ్డుకాళ్ళు'అనునది ప్రథమాంతమే.రాజుయొక్క కుణ్డికాళ్ళు(ఉద్యోగి)నివంబున (=రాజుగారిపేర?) పన్నస(భూమిదానము)ఇచ్చిన భూమి యిది అని ఆశాసనశిలయున్న పొలమును నిర్దేశించును. ఇట్లుకాక ఎరికల్ముత్తురాజుల్ల అనుదానికి ఎరికల్ముత్తు రాజు రాజ్యకాలమున అనివారు చెప్పిరి. అపుడు 'నివంబు'అనుదానికర్థము వేరుగ జెప్పవలెను. 2.దుజయరాజుల ముత్తురాజులు, నవప్రియ ముత్తురాజులు, వల్లవదుక రాజులు అను ముగ్గురు సాక్షిగ ఇచ్చిన పన్నస (ఇది)-అని రెండో వాక్యము సమాప్తమయ్యెను.దుజయ (దుర్జయ)రాజుయొక్క (పుత్రుడగు) ముత్తురాజు ఒకసాక్షి ముత్తు రాజనునది యొకానొక రాజపదవి అంటిమి గనుకఈయన పేరిందు లేదు దుర్జయరాజు అనునది తండ్రిపేరు.ఈసాక్షిపేరు వ్రాయ లేదన్నమాట.రెండవ సాక్షి నవప్రియ ముత్తురాజులు.నవప్రియుడనే పేరుగల యొక రాజకుమారుడు.మూడవసాక్షి వల్లవదుక రాజులు.వల్లభుడ నునది మరల బిరుదనే తోస్తుంది.అయినను ఆ బిరుదుగల దుకరాజు (దుగరాజు)అని చెప్పవచ్చును.'క','గ',లకు 'తద'లకు ఆనాడంత భేదముండె దికాదు.తుగరాజు,దుజరాజు,దుగరాజు అనుపదాలు యువరాజను అర్థములో వాడిన తావులనేకముగలవు. ఈ విధముగ తండ్రి పేరుతో మాత్రమే ఒకసాక్షియు బిరుదు పేర్లతో మిగిలిన ఇద్దరు సాక్షులు జెప్పబడిరి.

3.కొట్టంబున పాఱకు కుణ్డికాళ్లుళా ఇచ్చిన పన్నస ఇరువదియాది నాల్కు మఱుమ్తద్లునేల- అని మూడో వాక్యం పరిసమాప్తమయ్యెను.