ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు లిపి భాషల మొదలు-పేజి-9

కుటుంబములోనివారో కాదో యింకా స్పష్టముగా తెలియదు.6,7,8. శతాబ్దాల్లోని ప్రాచీన చోళ శాసనములు అతి క్లుప్తంగాను,చిన్న చిన్న తెలుగు పదాలో సంస్కృత-ప్రాకృత తద్భవాలో కలిగి యుండెడివి.గ్రామనామములు, ఏవైన బిరుదులు కొన్ని,రెండుమూడు పదముల సమాసముగా నుండెడివి. తాణ్ణికొణ్ద, తాడ్లఱేవ, చిఱుంబ్రోలు, తర్కపువ్రోలు,ఊరిస్వాముళ్, మార్పిడుగు, విడెల్విడుగు పెందెరువు, ముచ్చింతల, మున్నూఱు, వేనాన్ఱు, పెఱ్నిధి, ఇన్నల్వురు, పొలగరుసు, రట్టుగుళ్ళు, రాచమానంబు, వీరున్ఱయ్య.

సంస్కృతసమాసాలు యథాతథంగా వాడుకొనేవారు.

చరువశర్మ పుత్ర విన్నశర్మళాకు
పెర్బాణవంశ భుజంగది భూపాదిత్యులు

-అరకటవేములశాసనము.

కౌణ్డిల్య గోత్రస్య పెన్బాఱ రేవ శర్మాణ పుత్రస్య అగ్గిళమ్మా-రి కివ్విన దత్తి(చామలూరు శాసనము).అంటే వారికెట్లావస్తే అట్లా వ్రాసేవారు.ఇట్లాంటి సమాసాలను నన్నయ్యగారు క్రమబద్ధంచెయ్యటం తెలుగుతనానికి అపకారమో ఉపకారమో మరి?

పదజాలము:

ద్రవిడ, కర్ణాటక, ప్రాకృత భాషలనుండి అనేక పదములు తెలుగులో ప్రవేశించినవి. సంస్కృతమునుండి తత్సమములు తత్భవములనేకములు చేరుచున్నవి.కాని వాటినైన సరియగు విభక్తి ప్రత్యయములు చేర్చుకొని బహుళముగా వాడుకొనుట వారికింకా తెలియదు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, షష్ఠి, సప్తమీ విభక్తుల ప్రత్యయములే పరిమితముగా వాడబడెడివి. అవికూడా మనకిపుడు ప్రసిద్ధముగా నున్న(కారక) అర్థములలో వాడబడెడివికాదు. సమాపక క్రియలకు బదులు క్రియాజన్య విశేషములే అధికముగ వాడబడెడివి.ఇచ్చిన పన్నస, వ్రచ్చినవారు, నిల్పినశిల, వధిసిన పన్డు(ఇక్కడ డ ను θగా చదువుకోవలెను)

6, 7, 8,శతాబ్దములలో తెలుగుశాసనములందువచ్చుకొన్ని పదములు. కొను=తీసుకొను,పట్టుకొను → కఞచిగొణిన=కంచిని పట్టుకొనిన .రామాపురశాసనము.C.700AD,