ఈ పుట ఆమోదించబడ్డది

8

చడు+కట్టున్=చడుగట్టున్....(రామేశ్వరము)

పలంబు+కాన్చున్=పలంబుగాన్చున్...(రామేశ్వరము)

పరబలంబు+పొడిచి=పరబలంబు లొడిచి...(రాగిమడవనపల్లి)

ఈస్థితిం+తప్పువారు=ఈస్థితిదప్పువారు...(కొరవి)

వేయి+చెఱువుళు=వేసెఱవుళు...(మాలెపాడు)

4.ఇతరసంధులు:

మూణ్డు+నూఱు=మున్నూఱు

మూణ్డు+తూము=ముత్తుమ్బు

ఇను+మారు=ఇమ్మారు;ఇమ్మడి

ఈ+మూణ్డు=ఇమ్మూణ్డు...రామేశ్వరము

ఈ+నల్వురు=ఇన్నల్వురు...అరకటవేముల

పెద్ద+తెరువు=పెందెరువు

పెద్ద+చెఱువు= పెంజెఱువు

ప్రాచీన శాసనములలో సంధిని వివక్షచేయకపోవుటయే తరచు కనుపించును.రేనాణ్డు ఏళన్,శక్షికను ఇచ్చిన;శ్రీధరయకు ఇచ్చిననేల;పటుకాను;

సమాసములు; ఆయారాజులు వారి ప్రశస్తులలో ప్రసిద్ధమైన సంస్కృత సమాసాలనే అధికముగా వాడుకొనెడివారు. సమరసజ్ఘట్టణోపలబ్ధ జయలక్ష్మీ సమాలింగిత వక్షస్థల 'అని వైదుమ్బులు, జగత్త్రయాభివన్దిత సురాసురాధీశ పరమేశ్వర ప్రతీహారీకృత మహాబలికులోద్భవ 'అని బాణరాజులు చెప్పుకొనేవారు.కాని రేనాటి చోళులు మొదట్లో ప్రశస్తులే చెప్పుకోలేదు.' స్వస్తిశ్రీ చోడమహారాజుల్లేళన్ ' 'ఏర్కల్ముతురాజు ధనంజయుడు రేనాణ్డు ఏళన్ 'అంటూ ప్రారంభంచేసి శాసన విషయము చెప్పేవారు.

తర్వాత 'పృథివీవల్లభ విజయాదిత్య చోడమహారాజుళ్ 'అని పృథివీవల్లభ అని మాత్రమే చేర్చుకొన్నారు.కానికొంతకాలం తర్వాత అంటే తొమ్మిదో శతాబ్దిలో వీరు 'చరణసరోరుహ విహిత విలోచన త్రిలోచన ప్రముఖాఖిల,పృథ్వీశ్వర కారితకవేరీతీర, కరికాల కులరత్న ప్రదీప.అహితాంకుళ 'అనే ప్రశస్తిని మొదలు పెట్టిరి. కాని మొదటి రేనాటి చోళులు,ఈ ప్రశస్తిని చెప్పుకొనే ఆర్వాచీన చోళులు ఒకే