ఈ పుట ఆమోదించబడ్డది

తెలియదు.ఉరుటూరు శసనములో 'చోఱ మహారాజు θ ఏళ ' అనేప్రయోగం బహువచనంగా తోస్తుంది.రామేశ్వర శాసనములో 'చదు '(చెడు) ;అని యేకవచనాంతమునే తెలుపుచున్నది. అరకట వేముల(ప్రొద్దుటూరు తాలూక) శాసనములో వేంగుళూద్లు, పెను θకాలు, నారకోళు,కంచద్లు ఇన్నల్వురు సాక్షి అనియున్నది.ఇందు పెన్రుకాలు , అనే పదంలో క్రావడికూద కనిపిస్తోంది. కనుక ఈ θ ను ఱ అనటం బాగులేదు. ఇదివేరక్షరమే.పైన జెప్పిన రామేశ్వరశాసనమందే ౘదుగట్తున్, చθగట్టున్ అను రెండుప్రయోగములు గలవు. వీటికి 'చెడు తగులును'అను నర్థము చెప్పవలెను.కనుక 'θ 'అనేది 'డ' గా మారింది. అంతేకాదు చెఱచు, చెఱ అనే నేటి పదములలోని 'ఱ'పై చθ'లోనిθ'అగునా అని తోచుచున్నది. అందే చాణ్θ, ద్లా కు(చాండాలః)అను సంస్కృత తత్సమ పదము కలదు.'చండాలురకు'అని దీనిఅర్థము చెప్పవలెను.అదేశాసనములో 'కొణ్ణయ్య 'అనే పదంలో 'ణ్డ'అనే మూర్ధన్య సంయుక్తాక్షరం వాడబడింది.కానిదానిలోనే మూణ్θ (మూన్డు)దంత్య సంయుక్తాక్షరం కనిపిస్తోంది.తమిళ అవన్ నుండి వాన్,' వాన్డు' అయ్యినట్లుగాక 'మూన్θ' అను తమిళపదమే మొదటి నాడుకలో నున్నది, తరువాత 'వాణ్డు'వలె 'మూణ్డు' అయింది.

∉ రూపములో మరొక అక్షరము.ప్రాచీన తెలుగు శాసనాల్లో కనిపిస్తుంది. ఇది శఖట రేఫమో లేక వేరక్షరమో ఇంకా నిర్ణయం కాలేదు. ఒకేశాసనములో, ∉ ఱ, ఱ, θ అను నాలుగక్షరములు కనిపించును.ఇందు మొదటి రెండు 'ఱ ' యగునేమో.ఇంతవఱకు చెప్పినవిగాక సంస్కృతసంబంధము వలన మిగిలిన అక్షరములతో గూడిన నేటి తెలుగు వర్ణమాల యేర్పడెను.

సంయుక్తాక్షరములలో వర్గానునాసికములు వాడుటయందు తరువాతికాలమందెక్కువ నియమము కనుపించును.ప్రాచీన కాలమున అట్టి వాడుక ఉన్నట్లు అంతగా తోచదు. రాజ్యంచేయ, ధనంజయు, రాచమానంబున, ఫలంబు, అశ్వమేధంబు, చిఱుంబూరు,కొట్టంబు, భుజంగ, వంగనూర్లి మున్నగునవి అనుస్వారమునే కలిగియున్నవి. 'న్' స్థానములో అనుస్వారరూపములు అంతగా అప్పుడు కనిపించవు.(వస్తనిపోరి,సామన్తకముల్ వాన్డు, పాతకు θ మున్నగునవి) అట్లే 'ణ' కూడ. వాణ్డు, కొణ్డయ, రెణ్డు, రేనాణ్డు, ఇత్యాది.